జగన్‌ నివాసం వద్ద ఆ ఆంక్షలు ఎత్తివేత!

అంతేకాకుండా అడ్డంగా బారికేడ్లు, పోలీసు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Update: 2024-06-17 09:32 GMT

గుంటూరు జిల్లా తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌ ఇంటి వద్ద గతంలో రోడ్డుకు అడ్డుగా ఏర్పాటు చేసిన బారికేడ్లను, పోలీసు చెక్‌ పోస్టులను అధికారులు తొలగించారు. దీంతో దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు, తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రజలకు దారి కష్టాలు తప్పాయి. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే తాడేపల్లిలో ఆయన నివాసం వెనుక రోడ్డును మూసేశారు. అంతేకాకుండా అడ్డంగా బారికేడ్లు, పోలీసు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

జగన్‌ నివాసం వద్ద రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో గుంటూరు జిల్లా సీతానగరం నుంచి రేవేంద్రపాడు, దుగ్గిరాల, తెనాలి వైపు వెళ్లడానికి ప్రజలకు దారి లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఒకటిన్నర కిలోమీటర్లు దూరం అదనంగా వెళ్లాల్సి వచ్చేది.

వాస్తవానికి జగన్‌ నివాసం వెనుక కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్టరోడ్డు, కట్ట కింద నాలుగు వరుసల రోడ్డు ఉన్నాయి. ఈ మార్గాలు సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు రాకపోకలు సాగించేవారి కోసం నిర్మించారు.

అయితే జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనక నుంచి వెళ్లకుండా పోలీసులు ప్రజలను అడ్డుకున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ కట్ట రోడ్డు, కట్ట దిగువనున్న మార్గాల్లో ప్రజలు తిరగకుండా బారికేడ్లను పెట్టారు.

జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాడేపల్లిలోని ఆయన నివాసం వెనుక నుంచి వెళ్లే రెండు మార్గాలను పోలీసులు మూసివేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆ రెండు దారులకు రెండు పోలీసు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసింది.

జగన్‌ నివాసం వెనుక నాలుగులైన్ల రహదారితోపాటు పక్కనే కాలువపై ఉన్న రహదారిలో సైతం జనం రాకపోకలను అనుమతించ లేదు. దీనివల్ల తాడేపల్లి నుంచి కుంచనపల్లి, వడ్డేశ్వరం, గుండిమెడ, మెల్లెంపూడి, రేవేంద్రపాడు వెళ్లేవారందరూ చుట్టూ తిరిగి వెళుతున్నారు. దీంతో సీతానగరం నుంచి రేవేంద్రపాడుకు కాలువ కట్ట మార్గంలో వెళ్లేవారు 1.5 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి తలెత్తింది.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో ప్రజలు విన్నవించారు. ఇప్పటికైనా జగన్‌ నివాసం వెనుక ఉన్న రోడ్డులో రాకపోకలకు అనుమతించాలని అభ్యర్థించారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జగన్‌ నివాసం వెనుక రోడ్డులో బారికేడ్లను తొలగించారు. అంతేకాకుండా ఆ రోడ్డుకు రెండు వైపులా పోలీసు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసింది. ఆదివారం రాత్రి (జూన్‌ 16) నుంచి ప్రజల రాకపోకలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

Tags:    

Similar News