జగన్ అను నేను ...!

ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అచ్చెన్నాయుడు సహా వరసబెట్టి మంత్రులు చేశారు.

Update: 2024-06-21 06:23 GMT

ఏపీ 16వ శాసన సభా సమావేశాలు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు మొదలయ్యాయి. ఈ సమావేశాలలో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అందరి చేతా ప్రమాణాలు చేయించారు. ముందుగా సభా నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేత ప్రమాణం చేయించారు. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అచ్చెన్నాయుడు సహా వరసబెట్టి మంత్రులు చేశారు.

ఇదిలా ఉంటే అసెంబ్లీకి తన ఎమ్మెల్యేలతో హాజరైన జగన్ అపొజిషన్ బెంచీలలో కూర్చున్నారు. ఆయన పేరుని అసెంబ్లీ సెక్రటరీ పిలవడంతో జగన్ తన సీటు నుంచి లేచి వచ్చి ట్రెజరీ బెంచీల వద్ద ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రులకు నమస్కారం చేశారు.

అనంతరం ఆయన ప్రమాణం చేశారు. వైఎస జగన్ మోహన్ అను నేను అంటూ మొదట చదివిన జగన్ ఆ తరువాత సవరించుకుని జగన్మోహన్ రెడ్డి అను నేను అని చదివారు. అనంతరం జగన్ మరోసారి సభలోని టీడీపీ సభ్యులకు నమస్కారాలు చేస్తూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్యచౌదరికి నమస్కారం చేశారు. ఆయనతో కొద్ది సేపు మాట్లాడారు. అనంతరం స్పీకర్ సీటు వెనక వైపు నుంచి దిగి తన సీటు వైపు వెళ్లారు. అక్కడ నుంచి ఆయన అసెంబ్లీలో తన ఛాంబర్ కి నేరుగా వెళ్ళిపోయారు.

అక్కడ కొద్ది సేపు ఉన్న జగన్ అనంతరం అసెంబ్లీ నుంచి నేరుగా తన నివాసానికి వెళ్ళిపోయారు. ఇదిలా ఉంటే జగన్ సభలో ఉన్నది పది నుంచి పదిహేను నిముషాలు కావడం విశేషం. మరో వైపు చేస్తే ముందు వరసలో

విపక్ష బెంచీలలోనే వైసీపీ ఎమ్మెల్యేలు ఆసీనులు అయ్యారు. కొత్తవారు కూడా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేల వంతు వచ్చేవరకూ ఉండి వారు ప్రమాణం చేశారు.

ఇక జగన్ అసెంబ్లీని వీడి వెళ్తూంటే ఆయనకు మాజీ మంత్రి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడ్కోలు పలికారు. మొత్తం మీద జగన్ సభకు అటెండ్ అవుతారా లేదా అన్న సస్పెన్స్ కి తెర దించుతూ సమావేశాలకు హాజరయ్యారు. అయితే జగన్ పూర్తి స్థాయి సమావేశాలకు ఇక మీదట హాజరవుతారా అంటే అది డౌటే అని అంటున్నారు.

ఎందుకంటే ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉండడంతో జగన్ ప్రమాణం చేశారు అని అంటున్నారు. స్పీకర్ చైర్ లో అయ్యన్నపాత్రుడు ఉంటే జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషిస్తారా అన్నది చూడాలని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్షం పెద్దగా కనిపించకపోవచ్చు అన్న దానికి జగన్ పది నిమిషాల సేపు గడపడమే ఒక నిదర్శనం అని అంటున్నారు.

Tags:    

Similar News