నలభై వేల కంటే ఎక్కువ మెజారిటీతో ఓడిన వారినే జగన్ కలిసారా ?

పార్టీ నేతలతో జగన్ తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ని ఓడిన నేతలు అనేకమంది కలిశారు

Update: 2024-06-06 16:48 GMT

పార్టీ నేతలతో జగన్ తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ ని ఓడిన నేతలు అనేకమంది కలిశారు. అయితే వారిలో చూస్తే ఎక్కువ మంది భారీ తేడాలతో ఓడిన వారే ఉన్నారు. వారిలో గుడివాడ నుంచి కొడాలి నాని, అలాగే విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, మచిలీపట్నం నుంచి ఓడిన మాజీ మంత్రి పేర్ని నాని కొడుకు ఓడడంతో ఆయన కూడా వచ్చి కలిసారు.

ఇక విడదల రజని గుంటూరు వెస్ట్ నుంచి భారీ తేడాతో ఓటమి పాలు అయ్యారు. అలాగే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పాటు విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తదితరులు ఉన్నారు. ఈ నేపధ్యంలో జగన్ వారితో చాలా విషయాలు చర్చించారు.

అదే విధంగా పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు నలుగురు ఎంపీలు గెలిచారు. వారిని కూడా జగన్ అభినందించారు. ఈ సమీక్షలో జగన్ భారీ తేడాతో ఎందుకు ఓడామన్న దాని మీద కారణాలను నేతల నుంచి తెలుసుకోవడమే కాకుండా వారికి కూడా తనదైన విశ్లేషణ వినిపించారు. ఎందుకు ఓడామన్న దాని మీద జగన్ కి ఉన్న రీజన్స్ వారి ముందు పెట్టారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులతో జగన్ ఉల్లాసంగానే ఉన్నట్లుగా విడుదల అయిన ఫోటోలు వీడియోలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ కూటమికి వెల్లువలా వచ్చిపడిన ఓట్లు విషయంలో ఏ ఏ కారణాలు ప్రభావితం చూపాయి అన్న దాని మీద జగన్ మధనం చేశారు.

Read more!

వైసీపీ ప్రజలకు మంచి చేసిందని పార్టీ కచ్చితంగా గత వైభవాన్ని సాధించి తీరుతుందని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ శ్రేణులకు అండగా ప్రతీ నాయకుడు నిలవాలని ఆయన సూచించారు. టీడీపీ దాడుల మీద పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని జగన్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఈవీఎంల మీద కొందరు నాయకులు అనుమానాలు వ్యక్తం చేశారు అని అంటున్నారు. అలాగే ఈసీ పక్షపాతంగా వ్యవహరించందని పోలీసులు కూడా ఒక వైపే ఉన్నారు అన్నది కూడా రివ్యూలో వెల్లడి అయింది అని అంటున్నారు. అయితే జగన్ మాత్రం పార్టీ కోసం అంతా కష్టపడి పనిచేయాలని వైసీపీకి జనంలో క్రెడిబిలిటీ ఉందని పనిచేసుకుంటూ పోతే మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పినట్లుగా ఉంది. భారీ తేడాతో ఓటమి పాలు అయిన నేతలతో సైతం జగన్ సానుకూలంగానే మాట్లాడారని అంటున్నారు. అయితే మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారని అంటున్నారు.

Tags:    

Similar News