అమెరికా ఎన్నికల ఫలితాలపై జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో స్పందించిన భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-06 09:39 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో... దీంతో.. ఫ్లోరిడాలోని వెస్ట్ ఫామ్ బీచ్ లో తన మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని అన్నారు. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందని చెప్పుకొచ్చారు.

ఈ రాజకీయ మార్పు అమెరికాను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తుందని.. ఈ ఎన్నికల యుద్ధంలో రిపబ్లికన్లు పోరాడారని అన్నారు. సతీమణి మెలానియా, చిన్న కుమారుడు బారన్ తో కలిసి వేదికపైకి వచ్చిన ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో ఆమెరికా ఫలితాలపై జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్న్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం ఖరారైంది. ఈ నేపథ్యంలో స్పందించిన భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా.. వారి సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తారని పేర్కొన్నారు.

తాజాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ విదేశాంగ మంత్రులతో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జై శంకర్.. ఈ మేరకు వ్యాఖ్యానించారు. అమెరికన్లు తదుపరి అధ్యక్షులుగా ఎవరిని ఎన్నుకున్నా, ఎవరు ఎన్నికైనా.. వారి సొంత ప్రయోజనాల కోసమే పనిచేస్తారని అన్నారు. అయితే... కొత్త మార్పును స్వీకరించడానికి ప్రపంచ సిద్ధంగా ఉండాలని తెలిపారు!

ఈ సందర్భంగా... అభ్యర్థుల అభిప్రాయాలు ప్రజల ప్రాధాన్యతలకు విరుద్ధంగా ఉంటాయని.. ఇది ఒబామా నుంచి మొదలైందని మొదలుపెట్టిన జై శంకర్.. అమెరికా అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ట్రంప్ మరింత స్పష్టంగా ఉండొచ్చని అన్నారు.

ఇదే సమయంలో... అమెరికా మునుపటి కాలంలో చూపిన అధిపత్యం, దాతృత్వం కొనసాగకపోవచ్చని.. యూఎస్ ప్రభావం భిన్నంగా పనిచేసే ప్రపంచం కోసం మనం సిద్ధంగా ఉండాలని వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ... ద్వైపాక్షిక సహకారంలో అంచనా వేసిన వృద్ధితో పాటు అమెరికాతో భారత్ సంబంధం దృఢంగా ఉందని కూడా ఆయన నొక్కి చెప్పారు.

Tags:    

Similar News