సేనాని వారాహి : విశాఖలో టెన్షన్...టెన్షన్... !

ఆయనకు ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారని జనసేన నేతలు మండిపడుతున్నారు.

Update: 2023-08-10 07:30 GMT

సరిగ్గా పదకొండు నెలల తరువాత జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ వస్తున్నారు. ఆయన 2022 సెప్టెంబర్ 15న విశాఖ వచ్చారు. అపుడు జరిగిన ఉద్రిక్తలు టెన్షన్ అందరికీ తెలిసిందే. పవన్ ఎయిర్ పోర్టు నుంచి బీచ్ రోడ్డులో ఉన్న హొటల్ కి ర్యాలీగా చేరుకున్న సందర్భంలో పోలీసుల ఆంక్షలు దానికి జనసైనికులు మండిపడిన తీరు అన్నీ ఇపుడు అందరికీ గుర్తుకు వస్తున్నాయి.

ఇక ఆ తరువాత బీచ్ రోడ్ లో ఉన్న హొటల్ లో పవన్ ఉండిపోయారు. బయట పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పవన్ బయటకు వచ్చే పరిస్థితులు అయితే లేవని అప్పట్లో పోలీసులు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే అప్పట్లో పవన్ జనవాణికి ఆంక్షలు విధించడంతో అది కాస్తా రద్దు అయింది. మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత పవన్ విశాఖ వస్తున్నారు.

ఈసారి ఆయన వారాహి యాత్రతో వస్తున్నారు. అయితే పోలీసులు ఇపుడు కూడా ఆంక్షలు పెడుతున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. పవన్ బయట జనాలకు అభివాదం చేయకూడదు, ర్యాలీలు తీయకూడదు, జస్ట్ అలా వచ్చి మీటింగ్ చెపేసి వెళ్ళిపోవాలని పోలీసులు అంటున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వం వారాహి యాత్రకు కల్పిస్తున్న అడ్డంకులు అని వారు విమర్శిస్తున్నారు.

ఇదిలా ఉంటే పవన్ వారాహి యాత్రకు జగదాంబ జంక్షన్ వేదికగా ఎంచుకున్నారు. అయితే సిటీలో 144 సెక్షన్ అమలు లో ఉందని, అలాగే సెక్షన్ 30 కి అమలు చేస్తున్నామని ర్యాలీలు ఎవరు తీసినా ఊరుకునేది లేదని పోలీసులు చెబుతున్నారని జనసేన నేతలు అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ విశాఖలో వారాహి యాత్రలో పాల్గోనేందుకు విశాఖ చేరుకుంటే ఆయనకు ఎయిర్‌పోర్టులో పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారని జనసేన నేతలు మండిపడుతున్నారు.

అదే విధంగా అదేవిధంగా ఎయిర్‌పోర్టు ఆవరణలో ర్యాలీలకు సైతం అనుమతి నిరాకరించారు. మధ్యాహ్న సమయంలో సిటీలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందంటూ పవన్ వెళ్ళే రూట్‌లో మార్పులు చేర్పులు చేశారు. అదే విధంగా ఎయిర్‌పోర్టు నుంచి షీలానగర్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ నుంచి టూ టౌన్ మీదుగా వెళ్లాలని పోలీసులు షరతులు విధించారు.

ఇలా పోలీసులు పెడుతున్న కండిషన్లు ఒక వైపు ఉంటే తాము అలా చేయమని జనసేన అధినేతను ఘనంగా స్వాగతం పలికి తీసుకుని వస్తామని జనసేన నాయకులు అంటున్నారు. కేవలం పవన్ కళ్యాణ్‌ను ఎవ్వరూ చూడకూడదని లూప్ లైన్ రూట్‌లో పంపాలని పోలీసులు ప్రత్నిస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు

ఇలా పోలీసులు ఒక వైపు జనసైనికులు మరో వైపు మోహరించిన వేళ విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సాధారణంగా పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే జనాలు పెద్ద ఎత్తున తరలివస్తారు. వారిని అదుపు చేయడం సాధ్యం కాదు, పోలీసులు భద్రతాపరమైన చర్యలు అని చెబుతున్నా ఇదంతా తమ సభలను కార్యక్రమాలను అడ్డుకోవడమే అని జనసేన నేతలు అంటున్నారు. దీంతో విశాఖలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మరి పోలీసులు వయా మీడియాగా వ్యవహరిస్తారా లేక జనసేన సైనికులు పోలీసుల కండిషన్లు పాటిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News