ముద్రగడ బారసాలకు డేట్ & టైం ఫిక్స్... మొదలుపెట్టిన జనసైనికులు!

అవును... ఆంధ్రప్రదేశ్ లో తాజాగా పోలింగ్ ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.

Update: 2024-05-14 06:29 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత రసవత్తరంగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది! ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం అర్ధరాత్రి 12గంటల వరకూ సుమారు 78.36శాతం పొలింగ్ జరిగింది! ఇక ఫలితాల కోసం, ప్రజా తీర్పుకోసం జూన్ 4 వరకూ వేచి చూడాలి! ఈ సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో ముద్రగడ వర్సెస్ జనసేన వ్యవహారం మరో మలుపు తీసుకుంది. పోలింగ్ పూర్తవ్వగానే "టార్గెట్ ముద్రగడ" అంశాన్ని జనసేన స్టార్ట్ చేసేసింది.

అవును... ఆంధ్రప్రదేశ్ లో తాజాగా పోలింగ్ ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద అత్యంత హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి దృష్టి కూడా ఈ నియోజకవర్గంపై నెలకొందని చెప్పినా అతిశయోక్తి కాదు. దీనికి కారణం... ఇక్కడ నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటం ఒక కారణం కాగా.. పవన్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ ప్రకటించడం మరో కారణం!

ఇందులో భాగంగా.. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫిక్సవ్వగా.. ఒకవేళ పవన్‌ ను ఓడించకపోతే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ ఛాలెంజ్ చేశారు. ఈ నేపథ్యంలో... పిఠాపురంలో భారీగా పోలింగ్ నమోదయ్యిందని, అర్ధరాత్రి వరకూ ఓటర్లు క్యూలైన్ లో ఉండి ఓటు వేశారని.. సుమారు 80శాతం వరకూ పోలింగ్ నమోదైందని.. అది తమ విజయానికి సంకేతమని జనసైనికులు భావిస్తున్నారు.

దీంతో... ఫలితాలు అధికారికంగా విడుదల చేసి, మెజారిటీ ప్రకటించడమే తరువాయని.. గెలుపు ఆల్ రెడీ కన్ఫాం అయిపోయిందని చెబుతున్నారని తెలుస్తుంది! ఈ ఉత్సాహంలో ముద్రగడను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ర్యాగింగ్ స్టార్ట్ చేసేశారు! ఇందులో భాగంగా... "ముద్రగడ పద్మనాభరెడ్డి గారి నామకరణ మహోత్సవ ఆహ్వాన పత్రిక" అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. ఈ మేరకు పత్రికలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తున్నారు!

ఆ ఆహ్వానపత్రికలో.. "అందరికీ నమస్కారం అండి.. నూతన నామకరణ మహోత్సవం.. కాపు సోదర సోదరీమణులందరికి ప్రత్యేక ఆహ్వానం అండి.. 2024 జూన్ 4న సాయంత్రం 6 గంటల నుంచి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో.." అని మొదలుపెట్టారు.

అనంతరం... "ఏమండీ మరి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించిన తర్వాత, తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని మాట ఇచ్చిన పెద్దాయన, అతని మాటపై నిలబడతారని మాకు నమ్మకం ఉందండి. కావున అందరూ వచ్చి ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా మా ప్రార్థన. గమనిక మీ ఉప్మాకాఫీలు మీరే తెచ్చుకోవాలండి" అంటూ గోదారి జిల్లా వెటకారాన్ని దట్టించి ఒక ఆహ్వాన పత్రికను ఆన్ లైన్ లో వదిలారు! దీంతో... ఇప్పుడు ఈ వ్యవహారం నెట్టింట రచ్చ రచ్చగా మారింది.

కాగా... పిఠాపురంలో పవన్‌ కళ్యాణ్‌ ను ఓడించకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో పవన్ కల్యాణ్.. కాపుల కోసం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పవన్ సినిమాలలో నటించాలని.. రాజకీయాల్లో కాదు అని ఎద్దేవా చేశారు. త్వరలోనే జనసేన పార్టీ ప్యాకప్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు! దీంతో... పోలింగ్ అనంతరం జనసైనికులు ఇలా నెట్టింట రచ్చ చేస్తున్నారు!

Tags:    

Similar News