తెలంగాణా అధికార గీతం జయ జయహే తెలంగాణా...!

జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం అంటూ సాగే ఈ గీతం ఉత్తేజ భరితంగా సాగుతుంది.

Update: 2024-02-05 03:39 GMT

తెలంగాణా అధికార గీతానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. జయ జయహే తెలంగాణా అంటూ మొత్తం తెలంగాణా అస్థిత్వాన్ని గొప్పతనాన్ని వైభవాన్ని చాటే విధంగా రూపకల్పన చేసిన ఈ గీతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదించింది. దీంతో ఇది రాష్ట్ర గీతంగా ఇక మీదట ఉంటుంది అన్న మాట.

జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన కేతనం అంటూ సాగే ఈ గీతం ఉత్తేజ భరితంగా సాగుతుంది. తరతరాల చరిత గల తల్లీ అంటూ తెలంగాణా తల్లిని కొలుస్తూ ఈ గీతం ప్రభోదిస్తుంది.

ఈ గీతం పుట్టింది 2009 ప్రాంతంలో అప్పట్లో పది జిల్లాలు ఉన్నాయి ఉమ్మడి ఏపీలో దాంతో గీతంలో అదే ఉంచారు. పోతన, రుద్రమ, గండరగండడు కొమురం వంటి వారిని ఈ గీతంలో పొందుపరచి నీరాజనాలు అర్పిస్తూ సాగుతుంది. అలాగే కాకతీయుల కళ ప్రభలను గుర్తుకు తెస్తుంది. జానపదా కళలకు జావళీలు పట్టేలా తెలంగాణా ఉందని కీర్తిస్తుంది.

ఇక సింగరేణి బంగారం సిరి వెలుగులే చిందిస్తుందని, గోదావరి క్రిష్ణమ్మలు తెలంగాణా భూములలో పారి సుభిక్షం చేస్తాయని కూడా గీతంలో పేర్కొన్నారు. అలా తెలంగాణా స్వరాష్ట్రం అయి స్వర్ణమయం కావాలని ఒకనాటి ఆకాంక్ష ఈనాడు తీరింది. ఇపుడు ఆ ఉత్తేజపూరితమైన గీతం తెలంగాణా అధికార గీతం అయిపోయింది. అందెశ్రీ రచించిన ఈ గీతం తెలంగాణాకు గర్వకారణం అని భావించి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అలా రాష్ట్ర గీతం హోదా కల్పించింది.

Full View
Tags:    

Similar News