ఏపీలో ఉద్యోగ పర్వం...జగన్ సర్కార్ విజయం
81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తూనే మరో వైపు 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల తన చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంది.
ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం రాచబాట వేసింది. వారికి కొత్త జీవితం ఇచ్చేందుకు కంకణం కట్టుకుంది. జగన్ ఇచ్చిన మాట ప్రకారం వరసబెట్టి ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. నిద్యోగుల జీవితాలలో కొత్త వెలుగు తీసుకుని వస్తున్నారు. 81 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తూనే మరో వైపు 897 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల తన చిత్తశుద్ధి ఏంటో నిరూపించుకుంది.
కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే రెండు నోటిఫికేషన్లు ఇవ్వడం జగన్ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఏపీలో ఉద్యోగ జాతర మొదలైంది అని భావించాలి. విభజన తరువాత ఏపీ రాష్ట్ర చరిత్రలోనే ఇదొక బంగారు అవకాశంగా అంతా అంటున్నారు.
ఇక గ్రూప్ వన్ నోటిఫికేషన్ ద్వారా 81 పోస్టులను భర్తీచేయనున్నారు. అందులో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీ పోస్టులో భర్తీ కానున్నాయి. అదే విధంగా చూస్తే 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్ లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331 ఉంటే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. దీంతో నిరుద్యోగులు పండుగే చేసుకునే అవకాశాన్ని జగన్ ప్రభుత్వం కల్పించింది.
అంతే కదు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లెక్క తీస్తే ఇప్పటిదాక అక్షరాల ఆరు లక్షల 16 వేల 323 పోస్టులను నియమించింది. నిజం చెప్పాలంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగాలను గతంలో ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదు. ఉమ్మడి ఏపీలో కూడా ఇన్ని ఉద్యోగాలు ఎపుడూ కల్పించిన దాఖలాలు లేవు.
గత తెలుగుదేశం ప్రభుత్వతే తీసుకుంటే ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మోసం చేసిన చరిత్ర కళ్ల ముందు ఉంది. అంతే కాదు, సుప్రీం కోర్టు తీర్పు సాకుతో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా కాలం నెట్టుకుని వచ్చ్చింది. అయితే సీఎం గా జగన్ అయ్యాక అప్పటిదాకా ఉన్న నిబందనలు సడలించి సాధ్యమైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేసింది వైసీపీ ప్రభుత్వం.
ఒక విధంగా చూస్తే భారత దేశ చరిత్రలోనే ఇంత పెద్ద ఎత్తున ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది అని అంటున్నారు. అంతే కాదు జగన్ ప్రభుత్వం చేసిన మరో మంచి పని ఏంటి అంటే ప్రతీ ఇంటికీ ఉద్యోగాన్ని ఇవ్వడం.
అది కూడా వారి ఊరిలోనే. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి స్థానికంగానే జాబ్స్ ఇచ్చి కొత్త చరిత్రను సృష్టించారు. దాని వల్ల పేద మధ్యతరగతి జీవితాలు బాగుపడ్డాయని చెప్పక తప్పదు. వివిధ రంగాలలో ఉద్యోగాలు ఎలా భర్తీ చేశారు అన్నది చూస్తే కనుక ప్రజారోగ్య శాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50 నెలల్లో 53 వేల 126 పోస్టులను వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసింది.
అంతే కాదు లక్షా 84 వేల 264 పోస్టులు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేశారు.3 లక్షల 99 వేల 791 పోస్టులు అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన నియామకం జరిగింది. 19 వేల 701 పోస్టులు కాంటాక్ట్ విధానంలో నియామకాలు జరిగాయి. ఇవి కాక మరో 10 వేల 143 ఖాళీ పోస్టుల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. యూనివర్శిటీల్లో 3500 పోస్టులకు నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ఇవన్నీ ఏపీలో నిరుద్యోగ భూతాన్ని తరిమికొట్టే ప్రయత్నంలో జగన్ సర్కార్ సాధించిన అద్భుత విజయంగానే చూడాలని అంటున్నారు.
ఇక సంస్కరణలో ముందున్న జగన్ ప్రభుత్వం విద్యా వ్వవస్థకు కొత్త రూపుని తీసుకుని వచ్చింది. విద్య ఉంటే సమాజం బాగుపడుతుందని, ఆ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేది ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న సంకల్పం. ఈ క్రమంలో నాడు నేడు కార్యక్రమం కింద గతంలో ఏ ప్రభుత్వం హయాంలోనూ ఖర్చు చేయనన్ని నిధులు విద్యకు కేటాయించి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారన్నది మేధావులు సైతం కొనియాడుతున్నారు.
అనే కదు. బడి ఈడు పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్ళాలని కచ్చితమైన విధానాన్ని అనుసరించి అందరికీ చదువుని అందిస్తోంది వైసీపీ ప్రభుత్వం. సాధారణ ప్రభుత్వ బడులలో అసాధారణంగా అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ విద్యబోధన చేయడం గొప్ప విషయంగా చూస్తున్నారు.
వైద్య రంగంలో సాధించిన పగతి కూడా మామూలు కాదు. టిడిపి హాయాంలో వైద్య ఆరోగ్య శాఖలో 1693 పోస్టులు మాత్రమే భర్తీ చేయగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విలేజ్ క్లినిక్ లు మొదలకుని టీచింగ్ ఆస్పత్రులు ఖాళీలు పూర్తి స్థాయిలో భర్తీ చేశారు. దాంతో దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 53 వేల 126 పోస్టుల్నీ భర్తీ చేసిన ఘనత కూడా వైసీపీ ప్రభుత్వం దక్కించుకుంది.
వైద్య రంగంలో భర్తీ చేసిన పోస్టులలో 3899 మంది స్సెషలిస్ట్ డాక్టర్లు అయితే 2088 మెడికల్ ఆఫీసర్లు, 13540 ఎఎన్ఎమ్ లు గ్రేడ్ 3 పోస్టులతో కలిపి 19527 పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమాకాలు జరిగాయని గణాంకాలు అధికారికంగానే చెబుతున్నారు.
ఇక వీటికి తోడు అన్నట్లుగా 10 వేల 32 మంది ఎంఎల్ హెచ్పీలు, 6734 స్టాఫ్ నర్స్ లు, 9751 మంది పారా మెడికల్ సిబ్బంది, 3303 క్లాస్-4 సిబ్బంది, 249 మంది డీఈవోలతో పాటు మెడికల్ కాలేజీలలో నియమించిన 1582 ఉద్యోగులు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 53,126 పోస్టులు సైతం వైసీపీ ప్రభువం ఉద్యోగ విప్లవానికి నిదర్శనం అంటున్నారు.
ఇలా గడచిన నాలుగున్నరేళ్ల జగన్ పాలనలో 2.14 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించారు. మొత్తానికి ఉద్యోగాలు ఇస్తూ ఏపీకి ఆర్ధికంగా పరిపుష్టం చేస్తూ విద్యా వైద్య పరంగా ఎన్నో సంస్కరణలు చేపడుతూ జగన్ పాలన అంటే ఇదీ అని రుజువు చేస్తున్నారు.