అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యం.. ట్రంప్ కు జో బైడెన్ మద్దతు

ఉపాధ్యక్షురాలు, డెమోక్రాట్ అభ్యర్థి, భారతీయ మూలాలున్న కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ ముగిసన సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యం

Update: 2024-09-12 06:34 GMT

రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉపాధ్యక్షురాలు, డెమోక్రాట్ అభ్యర్థి, భారతీయ మూలాలున్న కమలా హారిస్ మధ్య తొలి డిబేట్ ముగిసన సమయంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యం.. అందరూ కమలాదే కాస్త పైచేయిగా చెబుతున్న సమయంలో ఆశ్చర్యం.. గత డిబేట్ లో తేలిపోయి.. ఆపై వయోభారంతో అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకొన్న అధ్యక్షుడు జో బెడెన్ ఏం చేస్తున్నారో ఆయనకే తెలియడం లేదు. ఎన్నికలు మరొక్క 55 రోజులు కూడా లేవనగా బైడెన్ అడుగులు ఎటువైపనే ఆసక్తి నెలకొంది.

ఆ విషాద సందర్భంలో..

గన్ కల్చర్ కు నెలవైన అమెరికా అనేక విపత్తులను చూసింది. మరెన్నో తుపాన్లను ఎదుర్కొంది. కానీ, ఆ దేశ చరిత్రలో చెరిగిపోని విషాదం అంటే.. అది 9/11. అసలు సిసలు సూపర్ పవర్ గా ఉన్న సమయ లో 2001 సెప్టెంబరు 11న జరిగిన ఈ దాడి మిగతా ప్రపంచాన్నీ వణికించింది. నాడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) జంట టవర్లలోకి ఉగ్రవాదులు విమానాలతో దూసుకెళ్తున్న సీన్ ఇంకా చాలామంది కళ్లెదుట కదలాడుతూనే ఉండి ఉంది. ఈ భయానక దాడి జరిగి ఈ సెప్టెంబరు 11వ తేదీతో 23 ఏళ్లు పూర్తయింది.

నాడు ప్రపంచ వాణిజ్యం.. నేడు గ్రౌండ్ జీరో

డబ్ల్యూటీసీ టవర్స్ అంటే నాడు అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో ప్రపంచ వాణిజ్య కేంద్రానికి సంకేతాలుగా భావించేవారు. అలాంటివాటిని ఉగ్రవాదులు కూల్చేశాక అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. మరే ఏ దేశమైనా.. ఆ జంట టవర్ల స్థానంలో మరింత పెద్ద భవనాలను నిర్మించేందుకు ఆలోచిస్తుంది. కానీ, తమ చరిత్రలో చెరగని విషాదాన్ని అమెరికా అలానే ఉంచాలనుకుంది. అందుకే ఆ ప్రదేశాన్ని గ్రౌండ్ జీరోగా మారుస్తూ ఏ నిర్మాణాలూ చేపట్టలేదు.

మెమోరియల్ నిర్మించి..

2001లో 3 వేలమంది మరనించిన డబ్ల్యూటీసీ టవర్ల స్థానంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టని అమెరికా.. అదే న్యూయార్క్‌ లోని 9/11 మెమోరియల్‌ నిర్మించింది. దీని వద్ద ఏటా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. 2001 నుంచి అధ్యక్షులు అందరూ ఏటా వచ్చి సంతాప కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా ఇలానే పాల్గొన్నారు. ఈ సందర్భంతా ఆయన ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం అయింది.

టోపీ పెట్టేశారు..

ఓవైపు అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్న సమయంలో.. 9/11 మెమోరియల్‌ వద్ద సంస్మరణ కార్యక్రమంలో బైడెన్ ‘ట్రంప్‌ 2024’ అని రాసి ఉన్న టోపీని బైడెన్‌ ధరించారు. ఈ కార్యక్రమానికి ‘ట్రంప్‌ 2024’ అని ఉన్న టోపీని ట్రంప్‌ మద్దతుదారుడు ఒకరు ధరించాడు. దీనిని చూసిన బైడెన్‌ అతడితో నవ్వుతూ సంభాషించారు. అతడి నుంచి టోపీని తీసుకుని ధరించారు. ఈ వీడియోను వైట్‌ హౌస్‌ ప్రతినిధి ఆండ్రూ బేట్స్‌ ఎక్స్‌ లో పోస్ట్‌ చేశారు. కాగా, ట్రంప్ పేరున్న టోపీని బైడెన్ ధరించడం ఐక్యతకు నిదర్శనంగా అభివర్ణించారు. ఇదే కార్యక్రమానికి కమలా హారిస్‌, ట్రంప్‌ కూడా హాజరవడం కొసమెరుపు. వీరిద్దరూ పెన్సిల్వేనియాలో జరిగిన తొలి డిబేట్‌ అనంతరం మళ్లీ కరచాలనం చేసుకోవడం మరో విశేషం.

Tags:    

Similar News