జోగి వ‌ర్సెస్ కొలుసు.. అస‌లు వాస్త‌వం ఇదే.. !

ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో ఆరోప ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, ఎమ్మెల్యే గౌతు శిరీష‌లు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.

Update: 2024-12-18 22:30 GMT

గ‌త రెండు రోజుల నుంచి ఏపీలో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసిన వ్య‌వ‌హారం.. టీడీపీ నేత‌లు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, మాజీ మంత్రి జోగి ర‌మేష్ ఎంట్రీ ఇవ్వ‌డం. సీఎం చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు.. ఆయ‌న ఇంటిపై జోగి ఆయ‌న అనుచ‌రులు విరుచుకుప‌డ్డారు. ఈ క్ర‌మంలో అలాంటి నాయ‌కుడితో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని ఎలా తిరుగుతార‌న్న‌ది.. టీడీపీ అనుకూల మీడియా సంధించిన ప్ర‌శ్న‌లు.

నిజానికి టీడీపీ అనుకూల మీడియా ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించే వ‌ర‌కు కూడా.. త‌మ్ముళ్లు కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పైగా.. ఇప్పుడు కూడా లైట్ తీసుకుంటున్నారు. కానీ, విజ‌య‌వాడ కు చెందిన బుద్దా వెంక‌న్న‌.. మాత్ర‌మే ప్రెస్‌మీట్ పెట్టి.. జోగిపై మ‌రోసారి విరుచుకుపడ్డారు. ఇక‌, ఈ కార్య‌క్ర‌మంలో ఆరోప ణ‌లు ఎదుర్కొంటున్న మంత్రి కొలుసు పార్థ‌సార‌థి, ఎమ్మెల్యే గౌతు శిరీష‌లు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. త‌మ‌కు ఏ పాపం తెలియ‌ని.. తాము పార్టీ లైన్‌ను విడిచేది లేద‌ని తేల్చిచెప్పారు.

అయితే.. ఈ విష‌యంలో అస‌లు ఎక్క‌డా ఏమీ జ‌ర‌గ‌కుండానే.. మాజీ మంత్రి స్థానంలో ఉన్న జోగి.. టీడీపీ కార్య‌క్ర‌మాల‌కు వ‌స్తారా? వ‌చ్చినా.. పోలీసులు అనుమ‌తించారా? పైగా.. మంత్రి కొలుసుతో క‌లిసి భుజం భుజం రాసుకుంటూ.. ఓపెన్‌టాప్ వాహ‌నంలో రోడ్ షో చేస్తారా? అనేవిమిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌లు. జ‌రిగిన విష‌యంలో త‌న త‌ప్పులేద‌ని.. అస‌లు జోగి విష‌యం కూడా త‌న‌కు తెలియ‌ద‌ని కొలుసు చెప్పుకొచ్చారు. కానీ, వీటిని నిర్ధారించేందుకు స‌రైన ఆధారాల‌ను ఆయ‌న చూపించ‌లేక పోయారు.

ఇదిలావుంటే.. పార్టీ నేత‌ల అంత‌ర్గ‌త స‌మావేశంలో కొలుసు చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. గ‌తంలో పెన‌మ లూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా ఉండ‌డం.. ఇద్ద‌రూ ఒకే పార్టీలో ఉండ‌డంతో .. వారి మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్న విష‌యాన్ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. టీడీపీలో చేరేందుకు.. కొలుసు ద్వారానే జోగి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని.. ఈ క్ర‌మంలో ఫ‌స్ట్ స్టెప్‌గా కొలుసు ఆహ్వానం మేర‌కే జోగి గౌతు ల‌చ్చ‌న్న విగ్ర‌హావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నార‌ని అంటున్నారు.

ఇద్ద‌రూ బీసీలే క‌నుక‌.. కొట్టుకుపోతుంద‌ని.. త‌ర్వాత‌.. పార్టీ వ్య‌వ‌హారం తేల్చేయాల‌ని నిర్ణ‌యించుకున్నా ర‌ని కూడా.. టీడీపీ నేత‌లు చెబుతున్నారు. కానీ, ఇది వివాదం కావ‌డం.. టీడీపీఅనుకూల మీడియా సీరియస్ గా తీసుకోవ‌డంతో ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంద‌ని వెల్ల‌డిస్తున్నారు. మ‌రి దీనిపై చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోచూడాలి.

Tags:    

Similar News