ఉమ్మడి మ్యానిఫేస్టో...టీడీపీ సేన బిగ్ ట్విస్ట్

ఇపుడు పొత్తులు కుదిరాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరలో రెండు పార్టీలు ఎలాంటి శషబిషలకు తావు లేకుండా అభ్యర్ధులను డిక్లేర్ చేస్తాయని అంటున్నారు.

Update: 2023-09-29 01:30 GMT

ఈసారి దసరా అదిరిపోవాల్సిందే. రాజకీయ దసరా కావాల్సిందే అన్నది టీడీపీ ఎప్పటి నుంచో అనుకుంటున్నది. అయితే అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తో సీన్ మొత్తం మారిపోయింది. ఆయన దాదాపుగా సెప్టెంబర్ నెల అంతా జైలులొనే గడిపారు. ఇక అక్టోబర్ లో బాబు బెయిల్ మీద బయటకు రావచ్చు అంటున్నారు.

దాంతో ఒక్కసారి బాబు బయటకు వచ్చిన తరువాత ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేన టీడీపీ కలసి ఉమ్మడి పోరాటానికి రెడీ అవుతాయని అంటున్నారు. టీడీపీలో పొలిటికల్ యాక్షన్ కమిటీ ఎటూ ఫార్మ్ అయింది. అది ఒక విడత భేటీ వేసింది. బాబు వచ్చాక మాత్రం పూర్తి స్థాయిలో డైరెక్షన్ ఆయన ఇస్తారు అని అంటున్నారు.

ఇక టీడీపీ ఈ ఏడాది మేలో జరిగిన మహానాడులో మినీ మ్యానిఫెస్టోని రిలీజ్ చేసింది. ఇందులో రైతులు, యువత, మహిళలకు సంబంధించి కీలకమైన హామీలను ఇచ్చింది. పూర్తి స్థాయి ఎన్నికల మ్యానిఫేస్టో దసరా నాటికి రిలీజ్ చేస్తామని ప్రకటిస్తూ వస్తోంది. బాబు అరెస్ట్ లేకపోతే సోలోగా టీడీపీ మ్యానిఫేస్టో రిలీజ్ అయ్యేది.

కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలులో చంద్రబాబుని పరామర్శించి అటు నుంచి బయటకు వచ్చిన తరువాత పొత్తుల విషయం అఫీషియల్ గా ప్రకటించారు. దాంతో ఇపుడు జనసేన మిత్రుడు అయిపోయారు. దాంతో ఒంటరిగా టీడీపీ ఎన్నికల ప్రణాళిక ఉండదని అంటున్నారు. రెండు పార్టీలు కలిసే జాయింట్ గా రిలీజ్ చేస్తారు అని అంటున్నారు.

అందులో పవన్ కళ్యాణ్ జనసేన ఇచ్చిన హామీలు కూడా కొన్ని ఉంటాయని అంటున్నారు. అలా రెండు పార్టీల కూటమి అధికారంలోకి వస్తే ఏమేమి ప్రజలకు చేస్తామని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. అంతే కాదు దసరా నాటికి వందకు పైగా అసెంబ్లీ నియోజకవర్గాలలో అభ్యర్ధులను ప్రకటించేందుకు టీడీపీ కసరత్తు చేస్తోందని కూడా ప్రచారం సాగింది.

ఇపుడు పొత్తులు కుదిరాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరలో రెండు పార్టీలు ఎలాంటి శషబిషలకు తావు లేకుండా అభ్యర్ధులను డిక్లేర్ చేస్తాయని అంటున్నారు. ఇలా ఈ విజయదశమి నుంచి జనాల్లోకి ఉమ్మడిగా వెళ్ళడం ద్వారా గ్రౌండ్ లెవెల్ నుంచి ఇటు క్యాడర్ కు అలాగే ప్రజలకు కూడా సంకేతాన్ని ఇవ్వడానికి చూస్తాయని అంటున్నారు.

మొత్తం మీద బాబు అరెస్ట్ కనుక లేకపోయి ఉంటే ఓన్లీ టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టో మాత్రమే వచ్చేది. ఇపుడు రెండు కలివిడిగా ప్రణాళిక వెలువడడం అభ్యర్ధుల ఎంపిక కూడా త్వరగా పూర్తి చేయడం వంటివి జోరందుకుంటాయని అంటున్నారు. మరి ఈ జోరు ఎంతదాకా రెండు పార్టీలలో హుషార్ తెస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News