చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు!
అవును... చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై కేఏ పాల్ విచురుకుపడ్డారు. ఈ గ్యాప్ లో సీఎం చంద్రబాబుపైనా మండిపడ్డారు.
మెగా స్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల పై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ మరోసారి విరుచుకుపడ్డారు. అంశం ఏదైనా, సందర్భంగా మరేదైనా పవన్ ప్రస్థావన వస్తే అంతెత్తున విరుచుకుపడే పాల్.. తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రోజుకు 500 కోట్ల రూపాయలు అప్పు చేయడం, అందులో డిప్యూటీ సీఎం పాత్రపైనా ఫైర్ అయ్యారు.
అవును... చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై కేఏ పాల్ విచురుకుపడ్డారు. ఈ గ్యాప్ లో సీఎం చంద్రబాబుపైనా మండిపడ్డారు. ఇందులో భాగంగా... ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 8 నెలలు కాగా.. ఇప్పటికే సుమారు రూ.1.20 లక్షలు అప్పు చేశారని.. అంటే నెలకు 15వేల కోట్లు, రోజుకి 500 కోట్ల చొప్పున అప్పు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలోనే చిరంజీవి, పవన్ కల్యాణ్ ప్రస్థావన తెచ్చిన పాల్... నాడు చిరంజీవి వల్ల కాంగ్రెస్ పార్టీకి పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అయిపోయాడని.. ఇప్పుడు టీడీపీ, బీజేపీలకు పదవి కోసం బానిసైపోయాడు అంటూ విమర్శించారు. అయినప్పటికీ కొంతమంది ఇంకా పవన్ కల్యాణ్ పేరు ఎత్తుతున్నారని పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా వీరి సామాజికవర్గం ప్రస్థావన తెచ్చిన పాల్.. వాళ్లలో చాలా మంది సిగ్గులేని వారు ఉన్నారని.. వాళ్లు మాత్రమే "డిప్యూటీ సీఎం తాలూకా" అని బోర్డులు పెట్టుకుంటున్నారని ఘాటుగా స్పందించారు. మోడీ వచ్చినప్పుడు పవన్ స్లోగన్స్ చేయాలని మెసేజ్ లు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఇదే సమయంలో... తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తుంటే.. తన తప్పులను చంద్రబాబుపైకి నెట్టేసి 2029లో తాను సీఎం కావాలని పవన్ ప్లాన్ చేస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేసిన పాల్... కేవలం పదవుల కోసం ప్రాకులాటే తప్ప రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఆలోచన నేతల్లో ఉన్నట్లు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.