కంగనాకు ఎంపీ టిక్కెట్ కన్ ఫాం అయిన వేళ పాత ట్వీట్ వైరల్!

అవును... అభ్యర్థుల ఐదో జాబితాలో భాగంగా ప్రకటించిన 111 మంది పేర్లలోనూ సినీనటి కంగనా రనౌత్ పేరు ఉంది

Update: 2024-03-25 11:30 GMT

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో భారతీయ జనతాపార్టీ తన అభ్యర్థుల ఐదో జాబితానూ ప్రకటించింది. ఇందులో భాగంగా... 18 రాష్ట్రాలకు చెందిన 111 మంది పేర్లను, వారి వారి నియోజకవర్గాలనూ ప్రకటించింది. ఈ సమయంలో సినీనటి కంగనా రనౌత్ కు బీజేపీ తొలిసారిగా అవకాశం ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నుంచి ఆమె ఎన్నికల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవబోతున్నారు.

అవును... అభ్యర్థుల ఐదో జాబితాలో భాగంగా ప్రకటించిన 111 మంది పేర్లలోనూ సినీనటి కంగనా రనౌత్ పేరు ఉంది. ఇందులో భాగంగా హిమాచల్ ప్రదేశ్ లోని మండీ నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే గతంలోనూ హిమాచల్ నుంచి పోటీపై ఆమె స్పందించారు. ఆ సందర్భంగా.. ఆమె గతంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేయడంపై విముఖత వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.

నాడు హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ అనే విషయంపై స్పందించిన కంగనా రనౌత్... తాను ఎన్నికల్లో పోటీ అంటూ చేస్తే హిమాచల్ ప్రదేశ్ నుంచి కాకుండా.. ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చే మరేదైనా ప్రముఖ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని ఉంది అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే అనూహ్యంగా ఆమెకు ఈసారి హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం కేటాయించబడింది. దీంతో... నాడు కంగనా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు నెటిజన్లు!

ఆ సంగతి అలా ఉంటే... ఐదో జాబితాలో తన పేరు కన్ ఫాం కావడం, తనకు సొంత రాష్ట్రం నుంచే పోటీ చేసే అవకాశం దక్కడం, బీజేపీ లోక్ సభ అభ్యర్థుల జాబితాలో తనకు స్థానం కల్పించడం పై ఆమె తాజాగా ఇన్ స్టా వేధికగా స్పందించారు. ఇందులో భాగంగా... తన ప్రియమైన భారతదేశ ప్రజల సొంతపార్టీ అయిన బీజేపీకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. ఇదే సమయంలో అధికారికంగా బీజేపీలో చేరడం తనకు ఎంతో గౌరవంగా ఉందని అన్నారు.

ఇక తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ స్థానం అభ్యర్థిగా తన పేరు ప్రకటించిందని.. ఎన్నికల్లో పోటీ విషయంలో హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. ఇదే సమయంలో... భారతీయ జనతాపార్టీ కార్యకర్తగా.. విశ్వసనీయ ప్రజాసేవకురాలిగా ప్రజలకు సేవ చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News