బీఆరెస్స్ మ్యానిఫెస్టో కంట్రోల్-సి, కంట్రోల్-వి... కేఏ పాల్ ఫైర్!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆరెస్స్ మ్యానిఫెస్టో పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Update: 2023-10-16 17:18 GMT

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీఆరెస్స్ దూకుడు ప్రదర్శిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నోటిఫికేషన్ రావడానికంటే చాలా ముందుగానే అభ్యర్థులను ఫైనల్ చేసిన కేసీఆర్... నోటిఫికేషన్ వచ్చిన వారం రోజుల్లోనే ఇన్ ఛార్జ్ లను ఎంపిక చేయడంతోపాటు.. తాజాగా మ్యానిఫెస్టోనూ ప్రకటించేశారు. ఇదే సమయంలో హుస్నాబాద్ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం పూరించేశారు.

దీంతో తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మరోపక్క 55 మందితో కాంగ్రెస్ పార్టీ తన తొలివిడిత జాబితాను విడుదల చేసింది. మరోపక్క బీజేపీ ఆ పనిలో బిజీగా ఉందని చెబుతున్నారు. మూడు ప్రధాన పార్టీల సందడి అలా ఉంటే... 87 స్థానాల్లో పోటీకి సిద్ధమని టీడీపీ, 32 స్థానాల్లో పోటీకి జనసేన పోటీకి సిద్ధమని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆరెస్స్ మ్యానిఫెస్టోపై కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు.

అవును... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆరెస్స్ మ్యానిఫెస్టో పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. ఇందులో భాగంగా కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా... హైదరాబాద్‌ లో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్... తమ పార్టీ మ్యానిఫెస్టో ను బీఆరెస్స్ కాపీ కొట్టిందని తెలిపారు.

ఇదే సమయంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదని కేఏ పాల్ అన్నారు. ఇదే సమయంలో బీఆరెస్స్ కి సీట్లు తక్కువగా వస్తే కాంగ్రెస్ ను కలుపుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని జోస్యం చెప్పారు. ఇలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో... ప్రజలు ఆలోచించాలని, తన ప్రజాశాంతి పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కేఏ పాల్ కోరారు.

ఇక, తాను ఇచ్చిన హామీలను అమలు చేస్తానని కేఏ పాల్ తెలిపారు. ప్రజల దగ్గరి నుంచి దోచుకున్న సొమ్మును తీసుకుని మళ్లీ ఎన్నికల వేళ నేతలు జనాలకు పంచుతున్నారని ఈ సందర్భంగా కేఏ పాల్ ఆరోపించారు. ఇదే సమయంలో... తెలంగాణను రక్షించుకోవడానికి ఇది చివరి అవకాశమని ప్రజలకు సూచించారు కేఏ పాల్.

కాగా... తెలంగాణలో కోదండరాం, వైఎస్ షర్మిల పార్టీలను కాంగ్రెస్ వాడుకుందని.. బీఆరెస్స్, కాంగ్రెస్ ఒకటేనని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... కేసీఆర్ తన అభ్యర్థులను కాంగ్రెస్ నుంచి గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. అందుకే వారితో రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీలో చేర్పించారని.. ఎన్నికల్లో వారికి అయ్యే డబ్బును కూడా కేసీఆర్ ఖర్చు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News