బాబుకు పట్టుకుని కే ఏ పాల్ గట్టిగానే...!

చంద్రబాబుని పట్టుకుని ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్ గట్టిగానే విమర్శించారు.

Update: 2023-09-10 03:44 GMT

చంద్రబాబుని పట్టుకుని ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్ కేఏ పాల్ గట్టిగానే విమర్శించారు. అసలు ఈ డ్రామాలేంటి చంద్రబాబూ అంటూ ఆయన నంద్యాల అరెస్ట్ ని కూడా ఒక లెక్కన సెటైర్లతో దట్టించి వదిలారు. సామాన్యుడు అయిన తాను స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమిస్తే పోలీసులు తనకు ఒక ట్రీట్మెంట్ ఇచ్చారని, అయినా తాను గౌరవించానని బాబుకు మాత్రం వీఐపీ ట్రీట్మెంటేంటి అని ఆయన మండిపడ్డారు

దేశంలో చాలా మంది జైళ్ళకు వెళ్లారని, అవినీతి చేసి ఆరు లక్షల కోటు సంపాదించిన చంద్రబాబు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయని అయినా ఆయనకు వేరే చట్టాలు ఉన్నాయా అని కేఏ పాల్ సూటిగానే ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ మారణ హోమం సందర్భంలో ఏకంగా పద్దెనిమిది నెలలు జైలులో ఉన్నారని, సత్యం రామలింగ రాజు అయితే కొన్నేళ్ళ పాటు జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు.

లక్ష రూపాయలు లంచం తీసుకున్నారని ఆరోపణల మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగార్ లక్ష్మణ్ ని కూడా జైలు పాలు చేశారని ఆయన ఫ్లాష్ కధలు వినిపించారు. ఇక ఎక్కడో అమెరికాలో ఉంటున్న తన మీద ఏ ఆరోపణలు లేకుండానే 107 రోజుల పాటు జైలులో ఉంచారని కేఏ పాల్ అన్నారు.

చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలు వస్తే ఎదుర్కోవాలి కానీ ఈ డ్రామాలేంటో అని ఆయన కడిగేశారు. చంద్రబాబు అవినీతి చేశారు అని 13 సెక్షన్లతో పోలీసులు నోటీసులు ఇస్తే బాబు తన మీద వచ్చిన వాటిని ఎందుకు నిరూపించుకోరని ఆయన నిలదీశారు.

చంద్రబాబు అరెస్ట్ ని పవన్ కళ్యాణ్ ఖండించడం ద్వారా తాను ప్యాకేజి స్టార్ అని రుజువు చేసుకున్నారని పాల్ ఆయన్నీ విమర్శించారు. చంద్రబాబు కోసం అంతలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తాను స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమించి అరెస్ట్ అయితే దాన్ని ఖండించారా అని ఆయన ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు గురించి ప్రజలు తెలుసుకోవాలని పాల్ అంటున్నారు.

మొత్తానికి చూసుకుంటే ఏపీలో అన్ని విపక్ష పార్టీలు బాబుకు మద్దతుగా మాట్లాడుతూ వత్తాసుగా వస్తే ఒక్క కేఏ పాల్ మాత్రం బాబుది వట్టి డ్రామా అంటూ ఘాటైన విమర్శలు చేయడం విశేషమే. ఏది ఏమైనా పాల్ అన్నట్లుగా తన మీద వచ్చిన అవినీతి ఆరోపణలను బాబు ఎదుర్కోవాల్సిందే అని అంటున్నారు. మరి బాబు మాత్రం బెయిల్ తెచ్చుకుంటారని పాల్ చెబుతున్న మాట కూడా అంతా ఆలోచించాల్సిందే.

Tags:    

Similar News