24 గంటలే గడువు.. ముహూర్తం చూసుకుని.. కేసీఆర్ సహా కీలక నేతల నామిషన్లు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల ఘట్టం.. మరో 24 గంటల్లో ముగియ నుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కీలకమైన నామినేషన్ల ఘట్టం.. మరో 24 గంటల్లో ముగియ నుంది. దీంతో అధికార బీఆర్ ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోని కీలక నాయకులు గురువారం నామినే షన్ పర్వాన్ని వేగవంతం చేశారు. షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 3న నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. సరిగ్గా వారం రోజుల పాటు ఈ క్రతువును నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిం ది. ఈ గడువు శుక్రవారం(ఈనెల 10) మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది.
ఇక, అప్పటి నుంచి మరుసటి రోజు వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఏకాదశి తిథి రావడం, రోజు రోజంతా వర్జ్యం లేకపోవడం, రాజకీయ నేతలకు కలిసి వచ్చే హస్తానక్షత్రం ప్రవేశించిన ఘడియలు బాగుండడంతో కీలక నాయకులు నామినేషన్లను సమర్పించా రు. ముఖ్యంగా సెంటిమెంటుకు ప్రాధాన్యం ఇచ్చే సీఎం కేసీఆర్ కూడా తన సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి నామినేషన్ సమర్పించారు. ఇక, ఈ సారి ఆయన పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గానికి కూడా గురువారమే ఈ ప్రక్రియను ముగించనున్నారు.
ఎవరెవరు ఎక్కడెక్కడ?
+ గురువారం నామినేషన్ దాఖలు చేసిన వారిలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావుఉన్నారు. వీరు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల(కేటీఆర్), సిద్దిపేట(హరీష్‌రావు) నుంచి నామినేషన్లు దాఖలు చేశారు.
+ కాంగ్రెస్ తరఫున భట్టి విక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిరలో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.
+ బీజేపీ నుంచి ఇటీవలే కాంగ్రెస్‌లోకి వచ్చిన కాకా కుమారుడు వివేక్ చెన్నూరులో నామినేషన్ వేశారు.
+ కొన్ని వారాల కిందటే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాలేరు నియోజకవర్గం నుంచి గురువారమే నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులు భారీ అనుచరగణంతో బల నిరూపణలతో నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటుండడం గమనార్హం.