ద్వితీయ శ్రేణి నేతలకు బంపరాఫర్!

అందుకనే ప్రతి నియోజకవర్గంపైనా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని గెలుపుకోసం నియోజకవర్గం కేంద్రం, మండలాల వారీగా ద్వితీయ శ్రేణి నేతలతో టచ్ లోకి వెళుతున్నారట.

Update: 2023-11-08 23:30 GMT

పార్టీ అభ్యర్ధుల గెలుపు విషయంలో కేసీయార్ ద్వితీయ శ్రేణి నేతలకు బంపరాఫర్ ఇస్తున్నట్లు సమాచారం. పార్టీ అభ్యర్ధుల గెలుపు విషయంలో కేసీయార్ తీవ్ర నిరాసలోను, టెన్షన్ లోను ఉన్నారు. కారణం ఏమిటంటే అభ్యర్ధుల గెలుపుకు పార్టీలోని సీనియర్లు, ఇన్చార్జిలు పెద్దగా సహకరించటంలేదని ఫీడ్ బ్యాక్ వస్తోంది. నిజానికి పార్టీలోని సీనియర్లందరు అభ్యర్ధుల గెలుపుకు మనస్పూర్తిగా పనిచేస్తే విజయం పెద్దగా కష్టంకాదన్నది కేసీయార్ భావన. అయితే ఇపుడా పరిస్ధితి లేదన్న ఫీడ్ బ్యాక్ వల్ల టెన్షన్ పెరిగిపోతోంది.

అందుకనే ప్రతి నియోజకవర్గంపైనా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుని గెలుపుకోసం నియోజకవర్గం కేంద్రం, మండలాల వారీగా ద్వితీయ శ్రేణి నేతలతో టచ్ లోకి వెళుతున్నారట. అభ్యర్ధి గెలుపుకు పనిచేస్తే ఎన్నికలు అయిపోగానే మంచి నామినేటెడ్ పోస్టులు ఇస్తానని కేసీయార్ బంపరాఫర్ ఇస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఎక్కువ మెజారిటి ఏ మండలంలో వస్తుంది ? అనే విషయంపైన సదరు నేతకు పోస్టు దక్కుతుందని చెబుతున్నారట.

ఇదే విషయాన్ని అన్నీ నియోజకవర్గాల్లోను మంత్రులు కేటీయార్, హరీష్ రావు ద్వారా హామీలిపిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రులిద్దరు దక్షిణ తెలంగాణా, ఉత్తర తెలంగాణా ఇన్చార్జిలుగా ఉన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు తమకు కేటాయించిన జిల్లాల్లోని అభ్యర్ధులు, సీనియర్లు, ఎంఎల్సీలు, ఎంపీలతో మంత్రులు టచ్ లో ఉన్నారు. ఏ నియోజకవర్గంలో ఏమి జరుగుతోంది, ప్రచారం తీరుతెన్నులను లోకల్ నేతలు ఎప్పటికప్పుడు మంత్రులిద్దరికీ చేరవేస్తున్నారు. దాంతో అభ్యర్ధుల గెలుపుకు అవసరమైన అన్నీ జాగ్రత్తలను వీళ్ళు తీసుకుంటున్నారు. పనిలో పనిగా కొంతమందికి డైరెక్టుగా కేసీయార్ తోనే మాట్లాడిస్తున్నారట.

అలా మాట్లాడించిన సమయంలోనే మెజారిటి, నామినేటెడ్ పోస్టులపై కేసీయార్ హామీలిస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. అభ్యర్ధుల ప్రచారం, రోడ్డుషోలు, చిన్నపాటి సభలు అన్నింటినీ సెకెండ్ గ్రేడ్ లీడర్లే దగ్గరుండి చూసుకోవాలని కేసీయార్ చెబుతున్నారట. అవసరమైన ఖర్చులను మాత్రం అభ్యర్ధి లేదా పార్టీ చూసుకుంటోందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఏదేమైనా ఇంతకాలానికి కేసీయార్ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతల ప్రాముఖ్యతను గుర్తించారనే చెప్పాలి.

Tags:    

Similar News