డ్రగ్స్ కేసుల్లో కేరళ సరికొత్త రికార్డ్... ఘణాంకాలు ఏమి చెబుతున్నాయి?

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న, వెనుకబడిన దేశాలకు ఉమ్మడిగా ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి డ్రగ్స్ అనే సంగతి తెలిసిందే.;

Update: 2025-03-28 01:30 GMT
Kerala’s Drug Problem

ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన, చెందుతున్న, వెనుకబడిన దేశాలకు ఉమ్మడిగా ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి డ్రగ్స్ అనే సంగతి తెలిసిందే. ఈ విషయంలో అగ్రరాజ్యం, వెనుకబడిన దేశం అనే తారతమ్యాలు లేవు. ఈ సమయంలో భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా నిలిచిన కేరళ ఈ విషయంలో సరికొత్త రికార్డ్ సృష్టించిందనే విషయం తాజాగా సంచలనంగా మారింది.

అవును... అత్యధిక అక్షరాస్యత ఉన్న కేరళ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల భూతం వేధిస్తోందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ క్రమంలో తాజా నివేదికల ప్రకారం పంజాబ్ ను దాటేసి నెంబర్ వన్ డ్రగ్స్ ప్రభావిత రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఇందులో భాగంగా.. 2021లో 5696 గా ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కేసులు చేరుకున్నాయి.

వాస్తవానికి ఈ తరహా 2024 లో ఈ తరహా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కేసులు పంజాబ్ లో 9025గా ఉండగా.. కేరళలో అంతకు సుమారు మూడు రెట్లు అంటే... 27701గా ఉండటం గమనార్హం.

వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ లో ఒడిశాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేస్తున్న కేరళకు చెందిన అనీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్ర పోలీసులు సుమారు రోజుల తరబడి ఒడిశా అడవిలో తీవ్ర పరిస్థితులను ఎదుర్కొని నిందితుడిని పట్టుకున్నారు. అయితే.. తాజా లెక్కలు మాత్రం ఆ విషయాన్ని చిన్నది చేస్తున్నాయని అంటున్నారు.

ఇదే సమయంలో డ్రగ్స్ వ్యాపారాలు చేసే వారికంటే.. వ్యక్తిగత అవసరాల కోసం డ్రగ్స్ ను వాడేవారి సంఖ్య పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా... 2022లో అరెస్టైన డ్రగ్స్ వ్యాపారుల సంఖ్య 1660 కాగా.. పర్సనల్ వాడకానికి డ్రగ్స్ కలిగి ఉన్నందుకు అరెస్ట్ చేయబడినవారు 24,959 గా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

Tags:    

Similar News