అలా కనిపిస్తే జైలుకు పంపుతాడట.. కిమ్ మరో అల్టిమేటం

అయితే.. కిమ్ తాజాగా మరో చట్టాన్ని తీసుకొచ్చారు. అది కూడా మహిళలను టార్గెట్ చేస్తూనే ఈ కఠిన నిర్ణయం చేశారు.

Update: 2024-09-03 10:46 GMT

సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆ దేశంలోని ప్రజల పట్ల ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటాడు. ముఖ్యంగా మహిళలు ఎలా ఉండాలో కూడా వింత రూల్స్ పెడుతుంటాడు. మరోసారి ఆయన కఠినతరమైన ఆంక్షలను తీసుకొచ్చాడు. ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను టార్గెట్ చేస్తూ ఆయన ఈ నిబంధనలు తీసుకువస్తుంటాడు.

ఇప్పటికే 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మహిళలు టైట్ జీన్స్ వేసుకోవద్దని ఆ దేశంలో హుకుం జారీ చేశాడు. హెయిర్ కలరింగ్, అసభ్యకర రాతలుంటే బట్టలు ధరించడాన్ని నిషేధించారు. ఇలాంటి వేషధారణతో రోడ్లపై కనిపిస్తే నిర్దాక్షిణ్యంగా పెట్రోలింగ్ చేసే అధికారులు పోలీస్ స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. అనంతరం వారు నేరాన్ని ఒప్పుకొని ఇక నుంచి అలాంటి వేషధారణ జోలికి పోము అంటేనే విడుదల చేయడం చేశాడు.

ఇలాంటి ఫ్యాషన్ స్టైల్ ఆ దేశానికి ప్రమాదకరమని కిమ్ అభివర్ణిస్తుంటాడు. కిమ్ నిర్ణయాలపై అక్కడి మహిళలు ఇబ్బంది పడుతున్నా.. తప్పనిసరి పరిస్థితిలో వాటిని పాటిస్తున్నారు. దేశవ్యాప్తంగా అమలయ్యే దాక కిమ్ సైతం వదలడు. అందుకే కిమ్‌ను నియంతకు కేరాఫ్ అని కూడా అంటుంటాడు.

అయితే.. కిమ్ తాజాగా మరో చట్టాన్ని తీసుకొచ్చారు. అది కూడా మహిళలను టార్గెట్ చేస్తూనే ఈ కఠిన నిర్ణయం చేశారు. దేశంలో పోనిటెయిల్ హెయిర్ స్టైల్‌ను నిషేధించినట్లుగా తెలుస్తోంది. ఎవరైనా అలాంటి హెయిర్‌స్టైల్‌తో కనిపిస్తే 6 నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరికలు జారీ అయ్యాయట. శత్రువులపై యుద్ధంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి సెమీ ట్రాన్స్‌పరెంట్ స్లీవ్స్, జీన్స్, రంగేసుకున్న, పొడవు జుట్టు, టైట్ దుస్తులు వంటి దక్షిణ కొరియా ఫ్యాషన్లు తన దేశంలో కనిపించవద్దని కిమ్ లక్ష్యంగా చెబుతున్నారు.

Tags:    

Similar News