ఇంకా 15 దేశాలకు బ్రిటన్ 'రాజు'.. ఆస్ట్రేలియాలో మాత్రం ఆగ్రహం

కచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు అసలు ఆ బ్రిటిన్ దేశమే ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది.

Update: 2024-10-21 11:50 GMT

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం.. ఈ పేరు వినివినీ అందరికీ వెగటు పుట్టింది. కచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడు అసలు ఆ బ్రిటిన్ దేశమే ముక్కలయ్యే పరిస్థితి వచ్చింది. కానీ, ఆశ్చర్యకరం ఏమంటే.. బ్రిటన్ రాజు ఇప్పటికీ 15 దేశాలకు రాజుగా కొనసాగుతున్నారు. రెండేళ్ల కిందటి వరకు ఎలిజబెత్ రాణి ఉండగా.. ఆమెనే ఈ దేశాలన్నిటికీ రాణిగా కొనసాగింది. బ్రిటిష్ సామ్రాజ్యం విచ్ఛిన్నమై.. ఏ దేశానికి ఆ దేశం స్వతంత్రంగా, గణతంత్రంగా మారినప్పటికీ పలు దేశాలకు బ్రిటన్ రాజు లేదా రాణిలే అనధికారిక రాజు లేదా రాణి.

కారణం కామన్వెల్త్..

కామన్వెల్త్.. ఒకప్పుడు బ్రిటన్ పాలనలో ఉన్న దేశాలన్నిటినీ కలిపి కామన్వెల్త్ దేశాలుగా పేర్కొంటారు. వీటిలో కొన్నింటికి ఇంకా బ్రిటన్ రాజ వంశమే రాజు/రాణి. భారత్ మాత్రం స్వాతంత్ర్యం తర్వాత గణతంత్ర రాజ్యంగా మారింది. బ్రిటన్ రాజ కుటుంబాన్ని గౌరవ రాజు/రాణిగా అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది. మరోవైపు ఇదే అంశం (ఎలిజబెత్ ను రాణిగా పరిగణించడం)పై భారత్ తో కెనడా కొన్ని దశాబ్దాల కిందట తీవ్రంగా విభేదించింది. అయితే, ఆస్ట్రేలియా వంటి పెద్ద దేశానికి సైతం బ్రిటన్ రాజు లేదా రాణి (అనధికారిక) రాజుగా ఉండడం గమనార్హం.

అప్పుడు రాణి.. ఇప్పుడు రాజు..

వాస్తవానికి ఆస్ట్రేలియా 100 ఏళ్లకు పైగా బ్రిటిష్ పాలనలో ఉంది. ఈ సమయంలోనే అక్కడి ఆదివాసులను తుడిచిపెట్టేశారనే ఆరోపణలున్నాయి. చివరకు 1901లో ఆస్ట్రేలియా స్వాతంత్ర్యం పొందింది. గణతంత్రం (రిపబ్లిక్‌)గా మాత్రం ఏర్పడలేదు. అందుకనే మొన్నటివరకు ఎలిజబెత్ రాణి, ప్రస్తుత్తం ఆమె కుమారుడు చార్లెస్‌-2 రాజుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఎలిజబెత్ ఉన్నప్పుడే ఆమెను ఆస్ట్రేలియా రాణి హోదా నుంచి తప్పించాలని ప్రయత్నాలు సాగాయి. ఆమె స్థానంలో ఎంపీలు ఎన్నుకున్నవారిని రాజు లేదా రాణిగా నియమించేలా 1999లో ఓటింగ్‌ నిర్వహించారు. అయితే, అప్పట్లో స్వల్ప మెజారిటీతో ఈ తీర్మానం వీగిపోయింది. ఆస్ట్రేలియాలో ఆదివాసీ కన్సల్టేటివ్ అసెంబ్లీ ఏర్పాటుకు తీర్మానాన్ని కూడా 2023లో పార్లమెంట్‌ భారీ మెజార్టీతో తిరస్కరించింది. చార్లెస్ ప్రస్తుతం ఆస్ట్రేలియా, సమవో దేశాల్లో పర్యటిస్తున్నారు.

చార్లెస్ నువ్విక మా రాజు కాదు..

చార్లెస్‌ కు ఆస్ట్రేలియా పార్లమెంటులో అనూహ్య షాక్‌ తగిలింది. సోమవారం ఆస్ట్రేలియా పార్లమెంటులో ఆయన ప్రసంగిస్తుండగా.. ఆదివాసీ సెనెటర్‌ లిడియా థోర్పే గళం విప్పారు. రాజరికానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ‘ఇది మా భూమి. దీనిని తిరిగిచ్చేయండి. మీరు మా రాజు కాదు. దోచుకున్న సొమ్ము మొత్తం వెనక్కివ్వండి. మా ఆదివాసీలను యూరప్ వలసదారులు దారుణంగా హతమార్చారు’’ అంటూ నిమిషం పాటు కేకలు వేశారు. బ్రిటన్ రాజరికానికి ఇప్పుడే కాదు.. థోర్పే ఎప్పుడూ వ్యతిరేకినే. రెండేళ్ల కిందట ప్రమాణ స్వీకార సమయంలో ఎలిజిబెత్‌-2ను వలస రాజ్య పాలకురాలు అని పేర్కొన్నారు.

Tags:    

Similar News