కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్ డేట్... జగన్ ఆరా!

వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారంటూ గత కొన్ని రోజులుగా కథానాలు వస్తోన్న సంగతి తెలిసిందే;

Update: 2025-03-27 13:29 GMT
కొడాలి నాని ఆరోగ్యంపై కీలక అప్ డేట్... జగన్ ఆరా!

వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారంటూ గత కొన్ని రోజులుగా కథానాలు వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే... తాజాగా ఆయన బుధవారం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోగల ఏఐజీ ఆస్పత్రికి తరలించారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో ఆయనకు గుండె సంబంధిత సమస్యలున్నాయనే విషయం వైద్యులు నిర్ధారించారని తెలుస్తోంది.

అవును... కొడాలి నానికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే విషయంపై ఇటీవల తీవ్ర చర్చలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో.. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా.. కొడాలి నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. వాస్తవానికి కొద్దిరోజుల క్రితం వైద్య పరీక్షలు చేయించుకున్న కొడాలి నానికి.. గుండె సంబంధిత సమస్యలున్నాయని.. అందులో భాగంగా... మూడు వాల్స్ బ్లాక్‌ అయినట్టు వైద్యులు గుర్తించారు! దీంతో ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

దీంతో.. త్వరలోనే ఆయన ఈ సమస్యకు సంబంధించి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు శశిభూషణ్ వెల్లడించారు. అయితే... బంధువులు, సన్నిహితులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజానికం ఆందోళనకు గురవుతారనే ఉద్దేశ్యంతో నాని.. ఈ విషయాన్ని తమకు చెప్పలేదని ఆయన అన్నారు.

ఇదే సమయంలో... సెకండ్ ఒపీనియన్ అనంతరం ఉగాగి తర్వాత పూర్తి స్థాయి చికిత్స చేయించుకోవాలని కొడాలి నాని నిర్ణయించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో... కొడాలి నానితో మాజీ సీఎం జగన్ మరోసారి మాట్లాడారని తెలుస్తోంది. ఈ సందర్భంగా... వైసీపీ అధినేత జగన్ ఆరా తీసినట్లు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో.. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని.. తిరిగి ప్రజల్లోకి రావాలని వైసీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు కోరుకుంటున్నారని అంటున్నారు.

Tags:    

Similar News