పశ్చిమ టీడీపీలో లొల్లి...ప్లాన్ బీ అంటున్న తమ్ముళ్ళు...!

పొత్తులో భాగంగా ఈ సీటుని జనసేన కోరుతోంది. ఆ పార్టీ కీలక నేత పోగిన మహేష్ కి ఈ టికెట్ ఇప్పించాలని పవన్ చూస్తున్నారు

Update: 2023-12-11 05:01 GMT

టీడీపీ జనసేనకు ఎక్కడ టికెట్ ఇస్తుంది అన్నది చూచాయగా తమ్ముళ్లకు తెలిసిపోవడంతో కొన్ని చోట్ల సర్దుకుంటూంటే మరి కొన్ని చోట్ల మాత్రం లొల్లి స్టార్ట్ చేస్తున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీటు ఇపుడు టీడీపీ జనసేనల మధ్యన అతి పెద్ద పంచాయతీగా మారే చాన్స్ ఉంది అంటున్నారు.

పొత్తులో భాగంగా ఈ సీటుని జనసేన కోరుతోంది. ఆ పార్టీ కీలక నేత పోగిన మహేష్ కి ఈ టికెట్ ఇప్పించాలని పవన్ చూస్తున్నారు. దానికి చంద్రబాబు కూడా అంగీకరించారు అని ప్రచారం సాగుతోంది. దాంతో ఇపుడు వెస్ట్ సీటు మీద ఆశలు పెట్టుకున్న తమ్ముళ్ళు ఓపెన్ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అయితే తనకు పశ్చిమ సీటు ఇప్పించాలని చంద్రబాబుని కోరుతున్నారు.

బీసీ అభ్యర్ధిగా చంద్రబాబు తనకు న్యాయం చేస్తారు అని కూడా బుద్ధా వెంకన్న అనడం విశేషం. తనకు ఆ సీటు ఇస్తే గెలిచి చూపిస్తాను అని ఆయన అంటున్నారు. తనకు కచ్చితంగా ఆ సీటు దక్కుతుంది అన్న నమ్మకం ఉందని అన్నారు. అయితే ఒకవేళ టికెట్ దక్కకపోతే మాత్రం ప్లాన్ బీ కూడా తన వద్ద ఉందని బుద్ధా వెంకన్న అనడం ద్వారా సంచలనం రేపారు.

తాను టీడీపీకి చంద్రబాబుకు వీర విధేయుడను అని ప్రకటించారు. చంద్రబాబు కుటుంబం మీద ఈగ వాలనీయకుండా తాను చూసుకుంటూ వస్తున్నాను అని కూడా బుద్ధా వెంకన్న చెప్పుకొస్తున్నారు. సీటు ఇమ్మని బాబునే నేరుగా అడుగుతాను అంటున్నారు. మరి ఇవ్వకపోతే ప్లాన్ బీ ఉందని ఆయన చెబుతున్నారు. అ ప్లాన్ బీ ఏమిటి అన్నదే ఎవరికీ అర్ధం కావడం లేదు.

ఒక వైపు వైసీపీని గట్టిగా విమర్శించే నేతలలో ఆయన అగ్రభాగాన ఉంటారు. ఇప్పటికీ ఆయన వైసీపీని విమర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఏ పార్టీలో అయినా చేరుతారా మరి ప్లాన్ బీ అంటే ఏంటి అన్నది కూడా ఎవరికీ అంతు బట్టడంలేదు అంటున్నారు.

ఇక ఇదే సీటు మీద మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా ఆశలు పెట్టుకున్నారు. మైనారిటీ కోటాలో ఆయన సీటుని ఆశిస్తున్నారు. తనకు కచ్చితంగా టికెట్ ఇస్తారని నమ్మకంగా ఉన్నారు. అయితే జనసేనకే ఈ సీటుని టీడీపీ ఖరారు చెసింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ ఇద్దరు కీలక నేతలు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చర్చగా ఉంది.

పశ్చిమ టీడీపీలో వర్గ పోరు ఉంది. దాంతో జనసేనకు టికెట్ ఇచ్చినా పార్టీ కలసికట్టుగా పనిచేస్తుందా అన్న డౌట్లు ఉన్నాయి. మరో వైపు వైసీపీ నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీ చేస్తారని అంటున్నారు. ఇలా పొత్తు పార్టీల మధ్య గ్యాప్ ఉంటే మాత్రం వెల్లంపల్లికే ప్లస్ అవుతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News