సుఖేష్‌ ఆరోపణలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు గురించి తెలిసిన విషయమే. ఈ కేసు లో కవిత పేరు ప్రముఖంగా వినిపించిందని వార్తలొచ్చాయి.

Update: 2023-07-14 12:28 GMT

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు గురించి తెలిసిన విషయమే. ఈ కేసు లో కవిత పేరు ప్రముఖంగా వినిపించిందని వార్తలొచ్చాయి. ఇదే సమయం లో సుఖేష్ చంద్రశేఖర్ మీడియాకు లీకులు ఇస్తూ... కవితను, కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారనే కథనాలొచ్చాయి. ఈ సమయం లో ఆల్ మోస్ట్ ఫస్ట్ టైం కేటీఆర్ స్పందించారని తెలుస్తుంది.

రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసు లో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ పై పలు ఆరోపణలు చేశార ని తెలుస్తుంది. అయితే.. ఈ ఆరోపణల పై మంత్రి కేటీఆర్‌ స్పందించారని అంటున్నారు. ఇందులో భాగంగా... మోసగాడు, నేరస్థుడు సుఖేష్ తన పై కొన్ని హాస్యాస్పదమైన ఆరోపణలు చేశాడని మీడియా ద్వారా తెలుసుకున్నానని కేటీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

"మోసగాడు, సుఖేష్ అనే ప్రముఖ నేరస్థుడు నా పై కొన్ని హాస్యాస్పదమైన ఆరోపణలు చేశాడని మీడియా ద్వారా తెలిసింది. నేను ఈ పోకిరీ గురించి ఎన్నడూ వినలేదు. అతని అర్ధంలేని మాటల కోసం అతని పై బలమైన చట్టపరమైన చర్య తీసుకోవాలనుకుంటున్నాను" అని కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు.

ఇదే సమయంలో "ఫిబ్‌ స్టర్‌ ల నుండి ఇటువంటి క్రూరమైన వ్యాఖ్యలు/క్లెయిమ్‌ లను ప్రచురించేటప్పుడు మీడియా కూడా జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను" అని కేటీఆర్ ఆన్ లైన్ వేదికగా సూచించారు.

అయితే... మనీలాండరింగ్ కేసు లో ప్రధాన నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్‌.. తెలంగాణ గవర్నర్‌ తమిళ సై సౌందర్ రాజన్‌ కు లేఖ రాశారని తెలుస్తుంది. అవును... బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవిత, మంత్రి కేటీఆర్‌ పై సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ రాశార ని తెలుస్తుంది.

తన వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వాలని.. కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు తన పై ఒత్తిడి తెస్తున్నారని.. కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన స్టేట్‌ మెంట్ల లోని ఎవిడెన్స్ ఇవ్వమని అడుగుతున్నారని.. ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారని ఆ లేఖ లో పేర్కొన్నారని తెలుస్తుంది.

ఇదే సమయం లో దాదాపు 200 కోట్ల రూపాయల లావాదేవీల కు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. కవిత కు తనకు మధ్య జరిగిన వాట్సాప్ చాట్ అంతా రికార్డింగ్ ఉందని.. గవర్నర్‌ తమిళ సై కు సుఖేష్ చంద్రశేఖర్ రాశారని చెబుతున్న లేఖలో పేర్కొన్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News