బిగ్ బ్రేకింగ్... కేటీఆర్, హరీశ్ బస్సుపై కోడిగుడ్లతో దాడి!
ఈ సమయంలో... కేటీఆర్, హరీశ్ రావులకు ఊహించని నిరసన ఎదురయింది. వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి జరిగింది.
కృష్ణ బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కే.ఆర్.ఎం.బీ.)ను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆరెస్స్ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అసెంబ్లీ నుంచి కేటీఆర్, హరీశ్ రావులతో కలిసి బీఆరెస్స్ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సులో నల్గొండకు కు చేరుకున్నారు.
ఈ సమయంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ నివాసానికి చేరుకున్న కేటీఆర్, హరీశ్, కడియం శ్రీహరి... మధ్యాహ్న భోజనం చేసి అనంతరం సభా ప్రాంగణానికి బయలుదేరారు. ఈ సమయంలో... కేటీఆర్, హరీశ్ రావులకు ఊహించని నిరసన ఎదురయింది. వారు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్ల దాడి జరిగింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు గోబ్యాక్ నినాదాలు చేశారు. అయితే వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.
అవును... నల్గొండ బహిరంగ సభకు వెళ్తుండగా కేటీఆర్, హరీష్ తోపాటు బీఆరెస్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయాణిస్తున్న బస్సును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో లంచ్ ముగించుకొని బహిరంగసభకు బయలుదేరిన సమయంలో... కేటీఆర్, హరీశ్ లు ప్రయాణిస్తున్న బస్సును యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా... కేసీఆర్, కేటీఆర్, హరీశ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సమయంలో... వారు ప్రయాణిస్తున్న బస్సులపై కోడిగుడ్లు విసిరారు. దీంతో... వెంటనే అప్రమత్తమన పోలీసులు... కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సమయంలో బీఆరెస్స్ నేతలు ప్రయాణిస్తున్న బస్సు దారిపొడుగున కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఇప్పుడు ఈ విషయం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.