కేటీఆర్ ఎందుకు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు?

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని ఎన్నుకుని ప్రమాణ స్వీకార తంతు పూర్తి చేశారు.

Update: 2023-12-09 11:44 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీని ఎన్నుకుని ప్రమాణ స్వీకార తంతు పూర్తి చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ప్రమాణ స్వీకారానికి రాలేదు. తాము ఎంఐఎం సభ్యుడి చేత ప్రమాణ స్వీకారం చేయమని తెగేసి చెప్పారు. దీంతో వారి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. మరో బీఆర్ఎస్ నేత కేటీఆర్ సైతం ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. తన తండ్రి ఆరోగ్య రీత్యా తనకు మరో రోజు ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని కోరారు.

ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో శుక్రవారం వేకువజామున కాలుజారి పడిన కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. దీంతో యశోదా ఆస్పత్రి వైద్యులు పరీక్షించి ఆపరేషన్ నిర్వహించి విజయవంతం చేశారు. దీంతో ఆయన ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తండ్రిని చూసుకునేందుకు కూతురు కవిత, కుమారుడు కేటీఆర్ కేసీఆర్ ను చూసుకుంటున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు ధ్రువీకరించారు. వాకర్ సాయంతో కేసీఆర్ కాసేపు అటు ఇటు నడిచారు.

109 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలతో పాటు కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేయలేదు. కేటీఆర్ తన తండ్రి ఆరోగ్య రీత్యా మరో రోజు ప్రమాణం చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతున్నందున ఆయనకు ప్రత్యేకంగా మరోరోజు కావాలని అభ్యర్థించారు.

కేటీఆర్ తన తండ్రి వెంట ఉండటంతో మరో రోజు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో మూడో శాసనసభ కొలువు దీరింది. ఎమ్మెల్యేలకు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. ఒక్కొక్కరికి రెండు శాఖల చొప్పున సీఎం రేవంత్ రెడ్డి కేటాయించడం గమనార్హం. నేడు ఎమ్మెల్యేలు తమ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు.

119 మంది ఎమ్మెల్యేల్లో 109 మంది ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. కేటీఆర్ కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. కేటీఆర్ వారి తండ్రి కోసం ప్రమాణ స్వీకారం వాయిదా వేసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం ఎంఐఎం నేతను ప్రొటెం స్పీకర్ గా గుర్తించడంపై విమర్శలు చేస్తున్నారు.

Tags:    

Similar News