పొన్నాల ఇంటికి కేటీఆర్... రేవంత్ పై ఆసక్తికర కామెంట్!

ఇదే సమయంలో... త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆరెస్స్ లో చేరుతారని కేటీఆర్ చెప్పడం గమనార్హం.

Update: 2023-10-14 03:33 GMT

ఎన్నికలు సమీపిస్తున వేళ తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టడం కన్ ఫాం అంటూ బలంగా చెబ్బుతున్న బీఆరెస్స్.. ప్రత్యర్థులపై విమర్శలు కూడా అంతే బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ప్రత్యర్థులు ఆ అవకాశం కల్పిస్తున్నారనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఆ సంగతి అలా ఉంటే... పొన్నాల లక్ష్యయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంపై కేటీఆర్ స్పందించారు.

అవును... తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టాప్ మోస్ట్ సీనియర్ నేతల్లో ఒకరైన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీతో 48 ఏళ్ల అనుబంధానికి పొన్నాల లక్ష్మయ్య శుక్రవారం స్వస్తి పలికారు. పార్టీలో ప్రస్తుత పరిస్థితులు బాగా లేవని, పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను భరించలేక రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఆయన బీఆరెస్స్ లో చేరతారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఈ విషయాలపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా అసక్తికర కామెంట్లు చేశారు. ఇందులో భాగంగా... కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆరెస్స్ పార్టీలో చేరతానంటే ఇంటికెళ్లి ఆహ్వానిస్తామని కేటీఆర్ అన్నారు.

ఇదే సమయంలో... త్వరలో చాలా మంది ప్రముఖులు బీఆరెస్స్ లో చేరుతారని కేటీఆర్ చెప్పడం గమనార్హం. దీంతో... ఈ లిస్ట్ ఇంకా ఉందా.. లేక, కేటీఆర్ మైండ్ గేం ఆడుతున్నారా అనే చర్చ దానికనుగుణంగా నడుస్తుంది. అయితే... ప్రస్తుతం పార్టీని వీడుతున్న నేతలందరికీ టీపీసీసీ వ్యవహార శైలి నచ్చడం లేదని అంటున్నారు. పార్టీని వీడేముందు పొన్నాల చేసిన కామెంట్ కూడా అదే కావడం గమనార్హం.

మరోపక్క శుక్రవారం కర్ణాటకలో ఐటీ శాఖ రూ.42 కోట్లను పట్టుకున్న విషయంపైనా కేటీఆర్ ఇటు ముడిపెడుతూ స్పందించారు. ఇందులో భాగంగా... తెలంగాణ రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటక నుంచి వందల కోట్లను పంపిస్తుందని ఆయన ఆరోపించారు.

ఇదే సమయంలో... ఓటుకు నోటు కేసులో లంచం ఇస్తూ కెమెరాకు చిక్కిన వ్యక్తి పీసీసీ "చీప్" గా ఉన్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు ముందే ఊహించామని ఆయన ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను స్కాంగ్రెస్ గా సంభోదించిన ఆయన... తెలంగాణలో స్కాంగ్రెస్‌ కు నో చెప్పాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News