ఆ సింగర్ డ్రెస్ తోనే గూగుల్ కు లక్షల కోట్లు.. ఎలా కలిసి వచ్చాయంటే?
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థికంగా బలంగా ఉన్న ఈ సంస్థ మొదట్లో ఒక్క డ్రెస్ మూలంగా కోట్లాది రూపాయలు సంపదించుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా కీర్తి సంపాదించిన వారు తన సక్సెస్ వెనుక రహస్యాలను చెప్తే ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఎంత పెద్ద సంస్థ అయినా, ఎంతటి వ్యక్తి అయినా ఒక్క అడుగుతోనే మొదలు పెడతాడు. మెల్ల మెల్లగా అది ప్రపంచంలో గుర్తింపు సంపాదించవచ్చు. అలాంటి సంస్థనే ‘గూగుల్’. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థికంగా బలంగా ఉన్న ఈ సంస్థ మొదట్లో ఒక్క డ్రెస్ మూలంగా కోట్లాది రూపాయలు సంపదించుకుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఓ పాప్ సింగర్ ధరించిన డ్రెస్ కోసం నెటిజన్లు అంతా వెతికారంటే నమ్ముతారా? దీంతో సెర్చ్ ఇంజిన్ కే కోట్లాడి రూపాయల ఆదాయం వచ్చిందంటే నమ్మశక్యం కావడం లేదు కదా.. ఇదంతా నిజం. ‘గూగుల్’ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. సిలికాన్ వ్యాలీకి చెందిన ఓ చిన్న గ్యారేజీలో ప్రారంభమైన గూగుల్ నేడు 2 లక్షల కోట్ల కంపెనీగా అవతరించేందుకు కూత వేటు దూరమే ఉంది. 1998లో ప్రారంభమైన గూగుల్.. ఎదిగిన తీరు అనిర్వచనీయం. అలాంటి టెక్ దిగ్గజం ఆర్థికంగా ఎదిగేందుకు, పేరు ప్రఖ్యాతలు సంపాదించడానికి పరోక్షంగా ఓ సింగర్ ధరించిన డ్రెస్సే కారణం అయ్యింది.
ఆదాయం పెరిగిందిలా?
అది 2001. ఆ ఏడాది 2001లో గూగుల్ డూడుల్ ఇమేజ్ అనే టూల్‌ను లాంచ్ చేసింది. గూగుల్ ఇమేజ్ అనే టూల్.. డూడుల్ ఇమేజ్‌నే మార్చేసింది. అప్పటి నుంచి యూజర్ల సంఖ్య వేల నుంచి లక్షల్లోకి.. లక్షల నుంచి కోట్లకి పెరిగింది. గూగుల్‌లో అడ్వటైజ్మెంట్స్ కూడా పెరిగాయి. క్రమంగా ఆదాయ మార్గాలకు కొదువలేకుండా పోయింది. గూగుల్ ఇమేజెస్, యాప్స్, మ్యాప్స్, బిజినెస్ లిస్టింగ్ ఇలా అన్నింట్లో గూగుల్ ఇమేజ్ అనే టూల్ ఆ సంస్థ స్వరూపాన్నే మార్చేసింది. సెర్చ్ ఇంజిన్ సంపాదనలో 80 శాతం ఈ గూగుల్ ఇమెజ్ టూల్ వల్లే వస్తుందంటే అతిశయోక్తి కాదు. పరోక్షంగా తమ విజయానికి కారణమైన జెన్నీఫర్ లోపెజ్‌కు గూగుల్ ఫౌండర్లు సందర్భానుసారం కృతజ్ఞతలు చెబుతుండడం విశేషం.
అలా ఎందుకు అంటుంటారంటే..
అందంగా ఉన్న అమ్మాయిని చాలా మంది జెన్నిఫర్ లోపెజ్‌తో పోలుస్తుంటారు. ఆమె పేరుపై టాలీవుడ్‌లో ఓ సాంగ్ కూడా ఉంది. ఆ మాటకొస్తే పాప్ ప్రపంచంలో తనని నేచురల్ బ్యూటీ, గ్రేట్ సింగర్ అంటుంటారు. సంగీత ప్రపంచాన్ని తమ మ్యూజిక్‌తో ఉర్రూతలూగించిన కళాకారులకు ది రికార్డింగ్ అకాడమీ ప్రతి ఏడాది గ్రామీ అవార్డులను అందజేస్తుంది. 2001లోనూ ఈ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఆ ఈవెంట్‌కు జెన్నీఫర్ లోపెజ్ ఆకుపచ్చ రంగు డ్రెస్ ధరించి రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతే ఆ ఫొటోల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు తెలుసుకునేందుకు గూగుల్‌లో తెగ సెర్చ్ చేశారు. ఎంతలా అంటే ఒకానొక సందర్భంలో గూగుల్ సైట్ కూడా స్తంభించిపోయింది. ఈ ఊహించని పరిణామానికి గూగుల్ ఫౌండర్లు సైతం ఆనందంలో మునిగితేలారు. అప్పటి నుంచి గూగుల్ పేరు మార్మోగిపోయింది.
క్యూ కట్టిన ఇన్వెస్టర్లు
గూగుల్‌లో పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. అప్పుడే గూగుల్ ఫౌండర్లకు ఓ ఐడియా వచ్చింది. గూగుల్ ఇమేజెస్ అనే టూల్‌ను లాంచ్ చేస్తే ఎలా ఉంటుందని. ఇందుకోసం ముందుగా గూగుల్ ఇమేజెస్ టూల్‌ను ఎంపిక చేసిన యూజర్లకు అందుబాటులోకి తెచ్చి దాని పనితీరు ఎలా ఉంటుందా? అని టెస్ట్ చేశారు. ఆ ఐడియా అదిరిపోయింది.