ఆ విషయంలో భారత్ కు అమెరికా సంపూర్ణ మద్దతు పునరుద్ఘాటన!

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తో పాటు జపాన్, జర్మనీ లకు తమ మద్దతు విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా పునరుధ్గాటించింది.

Update: 2024-09-13 19:30 GMT

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తో పాటు జపాన్, జర్మనీ లకు తమ మద్దతు విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా పునరుధ్గాటించింది. ఇందులో భాగంగా... ఈ మూడు దేశాల శాశ్వత సభ్యత్వాలకు తమ మద్దతు ఉంటుందని నొక్కి చెప్పింది. ఈ సందర్భంగా ఐరాస శాశ్వత సభ్యత్వాల విషయంలో సంస్కరణపై కొత ప్రతిపాదనలను ప్రకటించింది!

అవును... యుఎన్ జనరల్ అసెంబ్లీ హై-లెవెల్ వీక్ కు సంబంధించి ప్రపంచ నాయకులు త్వరలో న్యూయార్క్ లో సమావేశమవనున్న నేపథ్యంలో యూఎన్ లోని యూఎస్ రాయబారి లిండా థామస్ గ్రీన్ ఫీల్డ్ ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... భారత్, జర్మనీ, జపాన్ ల శాశ్వత సభ్యత్వానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

ఇదే సమయంలో ఆఫ్రికా దేశాలకు శాశ్వత సభ్యత్వాలతోపాటు రెండు శాశ్వత స్థానాలను సృష్టించడానికి వాషింగ్టన్ మద్దతు ఇస్తున్నట్లు అమె ప్రకటించారు. ఇదే సమయంలో భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ తో కూడిన జీ4 దేశాలు ఐరాస భద్రతా మండలిలో శాస్వత స్థానాల కోసం ఒకదానికొకటి మద్దతు ఇచ్చే నాలుగు దేశాలని తెలిపారు!

ఇదే క్రమంలో... ప్రపంచంలోనే అత్యధిక జనాభాను కలిగి ఉన్న భారత్.. యూఎన్ కౌన్సిల్ లో ఉండటాన్ని తాము గట్టిగా సమర్ధిస్తున్నామని అన్నారు. అయితే... కొత్త శాశ్వత సభ్యులకు వీటోను విస్తరించడానికి మాత్రం యూఎస్ మద్దతు ఇవ్వదని వెల్లడించారు. వీటోను విస్తరించడం వల్ల కౌన్సిల్ లో మరింత ప్రతిష్టంభన ఏర్పడుతున్న భావిస్తున్నట్లు తెలిపారు.

కాగా... ఈ నెల 22 - 23 తేదీలలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే "సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్" కోసం న్యూయార్క్ కు భారత ప్రధాని మోడీ వెళ్లనున్నారు! ఈ సందర్భంగా... వచ్చే ఏడాదికి ఐక్యరాజ్యసమితికి 80ఏళ్లు నిండనున్న నేపథ్యంలో... సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి "భవిష్యత్ ఒప్పందం" ఏకాభిప్రాయంతో ఆమోదించబడుతుందని అంటున్నారు.

Tags:    

Similar News