బాలకృష్ణ సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు... కాల్చినా కేసుండదు స్పీకర్ సర్!
ఈ సమయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి మైకందుకున్నారు. కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన అంబటి రాంబాబు... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం పై ఈ రోజు చర్చ ఉందని ప్రకటించారు. టీడీపీ సభ్యులు ఉండాలని కోరారు.
అయితే అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలో మరోసారి టీడీపీ సభ్యుల నినాదాలు మొదలుపెట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ సమయంలో... టీడీపీ సభ్యులు ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని, కావాలనే సభకు అంతరాయం కలిగిస్తున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సమయంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్ వేయడం మొదలుపెట్టారు. ఆయనకు తోడు గద్దె రామ్మోహన్ రావు సైతం విజిల్స్ వేశారు. దీంతో దేవాలయం లాంటి సభ ఈలల గోలలతో హోరెత్తి పోయిందనే కామెంట్లు వినిపించాయి. దీంతో ఆ విజిల్స్ ని తీసుకోమని స్పీకర్ పంపిన మార్షల్స్ పై కూడా బాలయ్య దురుసుగా ప్రవర్తించారు.
ఈ సమయంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి మైకందుకున్నారు. కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని మండిపడ్డారు. ఇవాల బాలకృష్ణ, చంద్రబాబు సీట్లో కూర్చున్నారని.. అది చూసి రామారావు గారు పైన ఉన్నారు.. ఆయన సంతోషించి ఉంటారు.. నిజజీవితంలో చేయలేకపోయినా.. అసెంబ్లీలో ఆ సీట్లో కూర్చున్నారని అన్నారు.
అనంతరం... బాలకృష్ణకు ఇది పద్దతి కాదని తెలిపిన బియ్యపు... దయచేసి బాలకృష్ణను లోపలకి రానియ్యొద్దని స్పీకర్ ను కోరారు. మెంటల్ గా ప్రాబ్లం ఉందని బాలకృష్ణ "సర్టిఫికెట్లు" తెచ్చుకుని ఉన్నారని, ఆయన ఎవరిని కాల్చినా కేసులు ఉండవని అన్నారు. దయచేసి సర్టిఫికెట్ తీసుకుని లోపలికి పంపించమని బియ్యపు, స్పీకర్ ని కోరారు.
ఇదే సమయంలో టీడీపీ నేతలందరినీ సస్పెండ్ చేయమని, అనంతరం మానసిక ఆరోగ్య కేంద్రానికి పంపించమని స్పీకర్ ను విన్నవించారు. బాలకృష్ణ నిన్న మీసాలు తిప్పారు, వాళ్ల నాయనకు జరిగినప్పుడు మాత్రం తిప్పలేకపోయారు అని ఎద్దేవా చేశారు. కానీ... ఈ రోజు అసెంబ్లీలో మాత్రం వీది రౌడీళ్లా ప్రవర్తిస్తున్నారని, పద్దతి మార్చుకోవాలని సూచించారు.
వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని ఏమీ చేయలేకపోయారు బాలకృష్ణ అని బియ్యపు కామెంట్ చేశారు. అనంతరం... ఫ్లూటు జింక ముందు ఊదమని ఆయనే చెప్పారని, అలాంటప్పుడు చంద్రబాబు ముందు ఊదాలని, సింహం లాంటి జగన్ ముందు ఊదితే వీళ్లు బ్రతుకుతారా అని ఆయన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ప్రశ్నించారు!