మరోసారి మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు.. విష్ణుకు రిక్వస్ట్!

అవును... మంచు కుటుంబంలోని మంటలు ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది! వీరి సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే పరిస్థితి లేదా అనే ప్రశ్నలు అభిమానుల నడుమ తలెత్తుతున్నాయని అంటున్నారు.

Update: 2025-02-14 09:41 GMT

మంచు కుటుంబంలో వివాదాలూ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వీటికి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఫుల్ స్టాప్ పడుతుందనే సంగతి తెలియనప్పటికీ.. నిత్యం ఏదో ఒక మూల ఈ ఫ్యామిలీ వివాద అంశం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సమయంలో మంచు మనోజ్ మరోసారి మోహన్ బాబు యూనివర్శిటీలోని వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... మంచు కుటుంబంలోని మంటలు ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది! వీరి సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యే పరిస్థితి లేదా అనే ప్రశ్నలు అభిమానుల నడుమ తలెత్తుతున్నాయని అంటున్నారు. ఈ సందర్భంగా మీడియా ముందు మాట్లాడిన మనోజ్.. జగన్నాథ్ సినిమా ఈవెంట్ కోసం రాయచోటి వెళ్లి.. ఆ ఆడియో ఫంక్షన్ సమయంలో నన్ను కావాలని తొక్కేస్తున్నారని మాట్లాడినట్లు తెలిపారు.

ఈ సమయంలో తాను అక్కడ ఉన్నానని తెలిసి తనకు మద్దతుగా ఉన్నవారిపై దాడులు చేస్తున్నట్లు తెలిపారు. అప్పులు చేసి హాస్టల్స్ బిల్డింగులు పెట్టుకున్నవారిపై దాడులు చేస్తున్నారని.. యూనివర్శిటీలోని హేమాద్రి నాయుడు.. నా వాళ్లను కొట్టీ, ఒక్కో విద్యార్థికి ఇంత అని చెప్పి మరీ డబ్బులు వసూళ్లు చేస్తున్నారని మనోజ్ సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సమయంలో గతంలో మీడియా సంస్థలో పని చేసిన వ్యక్తి, ఇప్పుడు 17,000 మంది ఉన్న విద్యాసంస్థల్లో ఎలాంటి మీడియా బ్యాక్ గ్రౌండ్ లేకుండా నడుపుతున్న వ్యక్తి ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకుని తనను వేదించేందుకు ఆడుతున్న డ్రామా మాత్రమే ఇదని.. వాళ్లు చెబుతున్నట్లు ఇక్కడ ఆస్తుల గొడవ లేదని.. ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయమని పునరుద్ఘాటించారు.

హైదరాబాద్ లో బౌన్సర్లు దాడులు చేస్తే అక్కడ విషయాలు బయటకు వచ్చాయని.. అంతా ధైర్యం చేసి చూపించారని.. అయితే ఇక్కడ కూడా ఇదే తరహాలో బౌన్సర్లు దాడులకు పాల్పడుతున్నారని.. వర్శిటీ వద్ద తనకు మద్దతుగా ఉన్న షాపులపై కర్రలు, రాడ్డులతో దాడులు చేస్తున్నారని.. దాడుల అనంతరం సీసీ టీవీ ఫుటేజ్ లు తీసుకుని వెళ్లిపోతున్నారని తెలిపారు.

ఈ ఘటనపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించాలని.. స్థానికులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై ఉందని అన్నారు. గత మూడేళ్ల క్రితం పరిస్థితి ఇలా లేదని.. ఇప్పుడు ఎవరి మేనేజ్ మెంట్ లోకి వెళ్లి ఇలా నడుస్తుందో అందరికీ తెలుసని మనోజ్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో... విష్ణు, వినయ్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని మనోజ్ కోరారు.

Tags:    

Similar News