అదే నిజ‌మైతే.. 'ఆ సీఎం' దేశ ద్రోహేనా?!

ముఖ్య‌మంత్రి అంటే.. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వి. ఆయ‌న మాట‌కు.. రాష్ట్రం మొత్తం త‌ల‌వొంచుతుంది.

Update: 2025-02-04 08:30 GMT

ముఖ్య‌మంత్రి అంటే.. రాజ్యాంగ‌బ‌ద్ధ‌మైన ప‌ద‌వి. ఆయ‌న మాట‌కు.. రాష్ట్రం మొత్తం త‌ల‌వొంచుతుంది. సీఎం స్థానానికి ప్ర‌తి స్థానంలోనూ వాల్యూ ఉంటుంది. అలాంటి ముఖ్య‌మంత్రి పీఠాలు.. త‌ర‌చుగా వివాదా ల‌కు కేంద్రాలుగా మారుతున్నాయి. ముఖ్య‌మంత్రిగా ఉండి అవినీతి చేసిన జ‌య‌ల‌లిత‌.. సీఎం సీటులో ఉండి.. నిరంకుశంగా పాలించార‌న్న పేరు తెచ్చుకున్న జ‌గ‌న్.. వంటి వారు ఈ కోవ‌లోకి వ‌చ్చేవారే. అయితే.. ఇప్పుడు వీటిని మించిన వ్య‌వ‌హారం.. జాతి నాశ‌నాన్నికోరుకున్న ముఖ్యమంత్రిగా మ‌ణిపూర్ సీఎం మ‌రో తీవ్ర వివాదానికి కార‌ణ‌మ‌య్యార‌న్న‌వాద‌న వినిపిస్తోంది.

మ‌ణిపూర్‌లో గ‌త 2023లో జాతుల మ‌ధ్య వివాదం చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. మైతేయి, కుకీ అనే రెండు గిరిజ‌న జాతుల మ‌ధ్య రిజ‌ర్వేష‌న్ కు సంబంధించిన వివాదం తెర‌మీదికి వ‌చ్చింది. మైతేయీ ల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డంపై కుకీ స‌మాజానికి చెందిన నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది వివాదంగా మారి.. దాడుల‌కు, చివ‌ర‌కు మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, న‌గ్నంగా ఊరేగింపుల‌కు కూడా దారితీసింది. ఈ వ్య‌వ‌హారాలు గ‌తంలో తీవ్ర చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

మ‌హిళ‌ల‌పై జ‌రిగిన అకృత్యాలు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించాయి. ఈ ప‌రిణామాలు పార్ల‌మెంటు ను కూడా కుదిపేసిన విష‌యం తెలిసిందే. గ‌త రెండేళ్లుగా ఈ స‌మ‌స్య ఇలానేఉంది. అయితే.. తాజాగా సీఎం బీరేంద్ర‌సింగ్‌పై సంచ‌ల‌న విష‌యం వెలుగు చూసింది. అప్ప‌ట్లో మైతేయి వ‌ర్గానికి బీజేపీ కొమ్ము కాసింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్న విష‌యం తెలిసిందే. ఓట్ల ప‌రంగా ఎక్కువ‌గా ఉన్న మైతేయి వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్‌క‌ల్పించ‌డంపై దుమారం రేగిన స‌మ‌యంలోనే కుకీలు తిర‌గ‌బ‌డ్డారు.

ఈ స‌మ‌యంలో రాజ్యంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌విలో ఉన్న ముఖ్య‌మంత్రి ఇరు వ‌ర్గాల‌ను శాంతింప చేసేందుకు ప్ర‌య‌త్నించాలి. కానీ, మైతేయీ వ‌ర్గాన్ని రెచ్చ‌గొట్ట‌డ‌మే కాకుండా.. పోలీసు స్టేష‌న్ల‌లో ఉన్న ఆయుధాలు వారు తీసుకువెళ్లేలా స‌హ‌క‌రించాలంటూ.. సీఎం వ్యాఖ్యానించారు. దీనికి సంబందించిన ఆడియో అప్ప‌ట్లోనే దుమారం రేప‌గా.. తాజాగా ఇది నిరూప‌ణ అయింది. 93 శాతం మర‌కు శాస్త్రీయంగా ఆయ‌న గ‌ళంతో ఇది పోలుతోంద‌ని నివేదిక‌వ‌చ్చింది.

అయితే.. దీనిని మ‌రోసారి ప‌రీక్షించాల‌న్న డిమాండ్‌తో ప్రాధ‌మిక నివేదిక‌ను ప‌క్క‌న పెట్టారు. ఒక‌వేళ రెండో ప‌రీక్ష‌లో కూడా.. బీరేంద్ర సింగ్ వాయిస్ క‌రెక్టేన‌ని తేలితే.. ఆయ‌న జాతి ద్రోహానికే కాదు.. దేశ ద్రోహానికి పాల్ప‌డిన ముఖ్య‌మంత్రిగా బోను ఎక్క‌డం ఖాయ‌మ‌ని జాతీయ రాజ‌కీయ ప‌క్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Tags:    

Similar News