ప్రత్యేక హోదాతోనే అసలైన నివాళి

దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలో ఉమ్మడి ఏపీ రెండు గా విభజించబడింది. ఆ విధంగా తెలంగాణా ఆయనను ఒక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేసుకుంటోంది

Update: 2024-12-28 00:30 GMT

దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలో ఉమ్మడి ఏపీ రెండు గా విభజించబడింది. ఆ విధంగా తెలంగాణా ఆయనను ఒక రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేసుకుంటోంది. ఏపీకి కూడా మన్మోహన్ సింగ్ ప్రధాని హోదాలో ఏమీ తక్కువ చేయలేదు. ఆయన ప్రత్యేక హోదాను ఏపీకి వరంగా ప్రసాదించారు. అది కూడా తాను రాజ్యసభలో ప్రసంగం చేస్తూ అధికారికంగా చెప్పారు.

ఆయన దిగిపోయాక వచ్చిన కొత్త ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టాల్సి ఉంది. ఈ రోజున దేశ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నుంచి అంతా ఆయనను గొప్పగా పొగుడుతున్నారు. దార్శనీకుడు అంటున్నారు. ఆ దార్శనీకతతోనే మన్మోహన్ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా అన్న దానిని ఇచ్చారు.

మరి ఆయన బతికి ఉన్న పదేళ్ళ కాలంలోనూ దానిని సాకారం చేయలేదు. ఇపుడు ఆయన దివంగతులు అయ్యారు. ఆయనకు నివాళి అర్పిస్తున్నారు రాజనీతి కోవిదుడు అని కొనియాడుతున్నారు. అటువంటి ఆయన ఏపీ ప్రజల కోసం అయిదు కోట్ల మంది భవిష్యత్తు కోసం ఇచ్చిన ఒక విలువైన హామీని అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు అన్నదే ఏపీలో సగటు జనం ప్రశ్న.

మన్మోహన్ సింగ్ ఆర్ధిక విధనాలు గొప్పవి. ఆయన 144 కోట్ల మంది ఉన్న దేశాన్ని మలుపు తిప్పారు. ఉజ్వల భవిత వైపుగా నడిపించారు. అలాగే రాజధాని లేకుండా విభజనతో విడిపోయిన రాష్ట్రంగా ఏపీ తీరని అన్యాయానికి గురి అయింది. అందుకే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారు.

నిజనగా ప్రత్యేక హోదా అమలు అయి ఉంటే ఏపీ ఈ రోజున దేశంలో చాలా రాష్ట్రాల కంటే మిన్నగా ముందుకు దూసుకుని పోయేది. మన్మోహన్ సింగ్ కి ఈ విషయం తెలుసు కాబట్టే ఏపీ అలా ఎదగాలని అన్యాయం కారాదని ఉద్దేశ్యంతోనే ప్రధానిగా ఆ హామీ ఇచ్చారు.

ఆయన హామీని నెరవేర్చడం బాధ్యత ప్రస్తుత పాలకులకు కాదా అని అంటున్నారు. ఒక ప్రధాని ఇచ్చిన హామీని తరువాత ప్రభుత్వం అమలు చేయడం సహజమైన విషయం. కానీ ఏపీ విషయంలో అది జరగలేదు. ఇపుడు మన్మోహన్ సింగ్ దివంగతులు అయిన వేళ ఆయన ఆశయాలు నెరవేరుస్తామని అంతా అంటున్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అయితే ఆయన కోసం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తోంది. మన్మోహన్ సింగ్ ని సదా తలచుకునేలా ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తోంది.

మాజీ ప్రధాని మృతికి కేంద్ర మంత్రి వర్గం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాప తీర్మానం ఆమోదించింది.

శనివారం ఆయన అంత్య క్రియల వేళ అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సీపీఎస్ యూ లలో సగం రోజుల సెలవు ఉంటుందని కూడా కేంద్రం ప్రకటించింది. ఈ విధంగా ఆయనను గౌరవిస్తున్న తీరు అభినందనీయం. అయితే ఆయన ప్రధానిగా ఇచ్చిన హామీ అయిన ప్రత్యేక హోదాను కూడా నెరవేరిస్తే పూర్తి న్యాయం జరుగుతుందని అంటున్నారు. మరి ఆ దిశగా ఆలోచిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News