మారుతి 800.. నీలి రంగు తలపాగా.. ‘పన్మోహన్’ సింగ్

కానీ, జీవితాంతం నిరాడంబరంగా ఉన్నారు. కేవలం ఒకటే కారు.. ఒకటే రంగు తలపాగా.. పైగా సెలవు లేకుండా రోజులో అధిక గంటలు పని చేశారు.

Update: 2024-12-27 07:53 GMT

ఈ రోజుల్లో సాధారణ కౌన్సిలర్ కూడా ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు.. కాస్త డబ్బులు రాగానే రిలాక్స్ అయిపోతున్నారు.. జీవితంలో కుదురుకున్నామని భావిస్తేనే రోజుకు రెండు, మూడు రకాల డ్రెస్సులు వేసుకుంటున్నారు.. కానీ, ఆయన పదేళ్లు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు.. అంతకుముందు ఐదేళ్లు ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.. దీనికిముందు ప్రొఫెసర్ గా ఉన్నారు.. దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు గవర్నర్ గానూ వ్యవహరించారు.. కానీ, జీవితాంతం నిరాడంబరంగా ఉన్నారు. కేవలం ఒకటే కారు.. ఒకటే రంగు తలపాగా.. పైగా సెలవు లేకుండా రోజులో అధిక గంటలు పని చేశారు.

అదే ఎరుపు రంగు మారుతి 800..

మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన మన్మోహన్.. తన మనస్తత్వం కూడా అలాంటిదే అనిపించారు. పదవుల్లో ఉన్నప్పుడు విలాసవంతమైన కార్లలో ప్రయాణించారు. కానీ, ఆయనకు ఇష్టమైనది సొంతంగా కొనుక్కున్న ‘మారుతి 800’ మాత్రమే. ప్రధాన మంత్రి అధికారిక నివాసంలో బీఎండబ్ల్యూ దీనిని పార్క్‌ చేసేవారు. దానిని చూపించి ‘ఇది నా కారు’ అని చెప్పేవారట. సొంతంగా కొన్న ఈ కారుకు మన్మోహన్ ఎంతో విలువిచ్చేవారట. పైగా దానిని చూస్తే సామాన్యులకు తాను చేయాల్సిన పని గుర్తుకొస్తుందని చెప్పేవారట. బీఎండబ్ల్యూ విలాసానికి కాదని.. భద్రత దృష్ట్యా వాడాలని భద్రతాధికారులు కోరినా ‘రూ.కోట్ల విలువ చేసే ఆ కారు ప్రధానిది. నాది మాత్రం మారుతినే’ అని చెప్పేవారట.

ఎప్పుడూ నీలి రంగు తలపాగానే

మన్మోహన్ నిత్యం లేత నీలి రంగు తలపాగాతోనే కనిపించేవారు. ఇలా ఎందుకు..? అని చాలామందిలో ప్రశ్న. అయితే, లేత నీలి రంగు ఆయనకు బాగా ఇష్టం. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుకున్న సమయంలో మన్మోహన్ ను ఆయన స్నేహితులు బ్లూ టర్బన్ అని పిలిచేవారట.

ప్రధాని అయినా పన్మోహనుడే..

ప్రధానమంత్రిగా మన్మోహన్ బాధ్యతలు స్వీకరించేటప్పటికే ఆయన వయసు 72. సాధారణంగా అత్యంత ప్రశాంత జీవితం కోరుకునే వయసు అది. కానీ, మన్మోహన్ ఆ సమయంలో అత్యంత కీలక బాధ్యతలు చేపట్టారు. అంతేకాదు.. రోజులో 15 గంటలకు పైగా పనిచేస్తూ.. సెలవు అనేది లేకుండా శ్రమించారు. దీంతో ఆయనను ‘పన్మోహన్’(పనిని ఇష్టపడేవాడు) సింగ్ గా పిలిచేవారు.

Tags:    

Similar News