అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో ఉరి వేసుకున్న యువకుడు
అందులో తివారీ అనే యువకుడు పని చేస్తున్నాడు. 24 ఏళ్ల తివారీ.. ఎమ్మెల్యే వద్ద కొంతకాలంగా పని చేస్తున్నాడు.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే నివాసంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న వైనం సంచలనంగా మారింది. అయితే.. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎమ్మెల్యేకు ఏ మాత్రం సంబంధం లేదని చెప్పినప్పటికీ.. పలు అనుమానాలు వెంటాడుతున్నాయి. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆత్మహత్య చేసుకున్న ఈ యువకుడు ఎవరు? లాంటి ప్రశ్నలకు సమాధానాల్ని చూస్తే..
ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యేగేశ్ శుక్తాకు సంబంధించిన మీడియా వ్యవహారాల్ని చూసేందుకు ఒక సెల్ ను ఏర్పాటు చేశారు. అందులో తివారీ అనే యువకుడు పని చేస్తున్నాడు. 24 ఏళ్ల తివారీ.. ఎమ్మెల్యే వద్ద కొంతకాలంగా పని చేస్తున్నాడు. అతడు నాలుగేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. తాజాగా వారిద్దరి మధ్య ఏదో గొడవైంది.
దీంతో.. వారిద్దరి మధ్య మాటలు లేవు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే ఇంట్లోని మీడియా సెల్ లో పని చేసేందుకు వచ్చిన అతను.. తన ప్రియురాలితో వీడియోకాల్ లో మాట్లాడాడు. ఏమైందో కానీ.. వీడియో కాల్ లోనే.. ప్రియురాలి ఎదుట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో.. ఆమె పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే.. స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నాడు. అప్పటికే యువకుడు ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు. దీంతో.. ప్రియురాలి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట్లో చోటు చేసుకున్న ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.