మీర్ పేట్ గృహిణి హత్య కేసు.. అటు కర్కశత్వం - ఇటు నటనత్వం!

ఆమె మరణానంతరం ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని తనలోని నటనత్వంతో పండించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

Update: 2025-01-25 06:43 GMT

మీర్ పేట్ గృహిణి దారుణ హత్య కేసులో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తూ మరింత సంచలనంగా మారుతుంది. ఓ యువతి మోజులో ఉన్న గురుమూర్తి భారీగా ప్లాన్ చేసే భార్య అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకోవడంతో పాటు.. ఆమె మరణానంతరం ఓ సెంటిమెంట్ అస్త్రాన్ని తనలోని నటనత్వంతో పండించాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

అవును... మీర్ పేట్ లోని గురుమూర్తి అనే వ్యక్తి తన భార్య వెంకటమాధవిని హత్యచేసి ఆనవళ్లు తెలియకుండా చేయడానికి ఓ వెబ్ సిరీస్ ని ఫాలో అయ్యి.. ఇందులో భాగంగా భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికి, వేడి నీటిలో ఉడికించి, ఎముకలను పొడిగా ఏసి చెరువులో పాడేసిన వ్యవహరం తెలిసిందే!

ఈ క్రమంలో సుమారు ఐదు రోజుగా మృతదేహం ఆనవాళ్ల కోసం పోలీసులు తీవ్రంగా ప్రయణిస్తున్నారని అంటున్నారు. దీనికోసం నిందితుడు ఎముకల పొడిని పారేసినట్లూ చెబుతున్న చెరువు సమీపంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా.. ప్రకాశం జిల్లాకు చెందిన గురుమూర్తి - వెంకట మాధవికి సుమారు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి రెండు కుటుంబాలకూ దగ్గరి బంధుత్వం కూడా ఉందని అంటున్నారు. దీంతో.. హైదరాబాద్ లో నివాసం ఉంటూ.. పండగలకు, శుభకార్యాలకూ రెగ్యులర్ గా సొంత ఊరుకి వెళ్లి వస్తుండేవారు.

ఈ క్రమంలో మూడేళ్ల క్రితం సొంతూరు వెళ్లినప్పుడు అక్కడ ఓ యువతితో గురుమూర్తి ప్రేమ వ్యవహారం నడిపాడట. అయితే... ఈ విషయం ఆ యువతి ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియడంతో దేహశుద్ధి చేశారట. దీంతో... వ్యవహారం పోలీస్ స్టేషన్ మెట్లెక్కకుండా పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి సర్దుబాటు చేశారంట మాధవి కుటుంబ సభ్యులు.

అప్పటి నుంచి భార్యభర్తలు ఇద్దరి మధ్యా గొడలు జరుగుతుండేవంట. భార్య తరుపు వారి వల్లే తాను సొంత ఊరికి వెళ్లలేకపోతున్నట్లు గురుమూర్తి తరచూ భార్యతో గొడవపడేవాడంట. ఇలా సుమారు మూడేళ్లుగా ఏ పండుగకూ వెళ్లలేకపోవడానికి నువ్వు కారణం అంటే నువ్వూ కారణం అని ఒకరినొకరు నిందించుకునేవారని అంటుననరు.

ఈ సమయంలో కనీసం పిల్లలైనా సంక్రాంతి పండక్కి ఊరుకి వెళ్తారని.. మాధవి ఇద్దరు పిల్లలనీ పుట్టింటికి పంపించిందంట. అయితే... పిల్లల్ని ఊరు నుంచి తీసుకురమ్మంటూ అతడు ఒత్తిడి చేయడంతో మరోసారి గొడవ మొదలైందని.. సరిగ్గా అదే సమయంలో మరో మహిళతో అతడికి సంబంధం ఉన్న విషయం ఫోన్ లో గుర్తించి నిలదీసిందని చెబుతున్నారు.

ఈ సమయంలోనే అవకాశం చూస్తున్న గురుమూర్తి ఆమెను హత్యచేసి, ఆధారాలు దొరక్కుండా చేయాలని ప్రయత్నించినట్లు చెబుతున్నారు.

ఇక... తాజాగా గురుమూర్తికి మరో యువతితో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలో.. ఆమెను వివాహం చేసుకునే ఆలోచనలో అతడు ఉన్నాడని అంటున్నారు. ఇలా భార్య మరణించిన తర్వాత ఇద్దరు పిల్లలను బాధ్యతగా చూసుకునేందుకు తెలిసిన అమ్మాయి అయితే మంచిదనే సెంటిమెంట్ ను ఉపయోగించి ఆమెను సొంతం చేసుకోవాలనేది ఇతడి ప్లాన్ కావొచ్చని అంటున్నారు.

Tags:    

Similar News