మొదటి సంతకానికి ముందు తల్లి మాటను ఫాలో అయిన రామ్మోహన్ నాయుడు

మోడీ సర్కారులో కేంద్ర మంత్రిగా చోటు దక్కించుకున్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

Update: 2024-06-14 16:24 GMT

మోడీ సర్కారులో కేంద్ర మంత్రిగా చోటు దక్కించుకున్న టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మోడీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచిన అతనికి 2014లోని ఎన్డీయే ప్రభుత్వంలో అత్యంత సీనియర్ అయిన అశోక్ గజపతిరాజుకు కేటాయించిన పౌర విమానాయాన శాఖను ఈసారి రామ్మోహన్ నాయుడికి కేటాయించటం ఆసక్తికరంగా మారింది. దేశంలోని అత్యంత కీలకమైన శాఖల్లో ఒకటిగా విమానయాన శాఖ నిలుస్తుంది.

రానున్న రోజుల్లో ఈ శాఖను పెద్ద ఎత్తున విస్తరించే వీలున్న సంగతి తెలిసిందే. విమాన ఛార్జీలను అందుబాటు ధరల్లోకి తీసుకురావటమే తన ముందున్న లక్ష్యంగా రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. కరోనా తర్వాత విమాన ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు తాను చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తానని.. వరుస సమీక్షల్ని త్వరలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తాజాగా మంత్రి బాధ్యతల్ని చేపట్టిన ఆయన.. తన తల్లి చెప్పిన మాటలను తూచా తప్పకుండా ఫాలో కావటం ఖాయం.

మంత్రిగా బాధ్యతల స్వీకరణకు ముందు.. తెల్ల కాగితం మీద తెలుగులో ‘‘ఓం శ్రీరామ’’ అంటూ 21 సార్లు రాయాలని కోరారు. ఆ తర్వాతే కేంద్ర మంత్రి బాధ్యతల్ని స్వీకరించాలని.. మొదటి ఫైలు మీద సంతకం చేయాలని చెప్పారు. ఇందుకు తగ్గట్లే.. రామ్మోహన్ నాయుడు ఫాలో కావటం ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి అయినా అమ్మకు కొడుకే కదా? అమ్మ చెప్పిన తర్వాత చేయకుండా ఉంటారా చెప్పండి.

Tags:    

Similar News