లాస్ట్ రివ్యూ : జగన్ చేతిలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టు.. !
చాలా కాలం తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో రివ్యూ చేస్తున్నారు. వారి పనితీరు పట్ల సీఎం నివేదికల సాక్షిగా చెప్పాల్సింది చెబుతారు.
చాలా కాలం తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో రివ్యూ చేస్తున్నారు. వారి పనితీరు పట్ల సీఎం నివేదికల సాక్షిగా చెప్పాల్సింది చెబుతారు. ఆయన చేతిలో వివిధ సర్వేలతో పూర్తి స్థాయి ప్రోగ్రెస్ రిపోర్టులు ఉన్నాయని అంటున్నారు.
గడప గడపకు ఎమ్మెల్యేల పనితీరు మీద సీఎం సమీక్షను మంగళవారం నిర్వహిస్తారు అని అంటున్నారు. ఉదయం అసెంబ్లీ సెషన్ పూర్తి అయిన తరువాత సీఎం క్యాంప్ ఆఫీసులో ఈ రివ్యూ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.
మొత్తం 151 ఎమ్మెల్యేలలో ఒక్కో ఎమ్మెల్యే పనితీరుని జగన్ స్వయంగా అంచనా కట్టి వారి గ్రాఫ్ ఏంటి అన్నది వివరించనున్నారు అంటున్నారు. అదే విధంగా వారు ప్రజలతో ఎలా మమేకం అయ్యారు అన్నది కూడా చూస్తారు అని అంటున్నారు. అలాగే ఎమ్మెల్యేలు ఎంత చురుకుగా వ్యవహరిస్తున్నారు అన్నది కూడా తేల్చనున్నారు.
ఇక ప్రజా వ్యతిరేకత ఏ ఏ ఎమ్మెల్యేల మీద ఉంది అన్న లెక్క పక్కాగా జగన్ వద్ద ఉంది అంటున్నారు. అదే విధంగా గెలుపు కచ్చితం అన్న ఎమ్మెల్యేలు ఎంత మంది కూడా ఈసారి జగన్ చెప్పబోతున్నారు అని అంటున్నారు.
ఇక జగన్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే నాలుగైదు ఏజెన్సీల సర్వేల నివేదికలను క్రోడీకరించి ఇచ్చే ఫైనర్ రిపోర్ట్ అని అని అంటున్నారు. దాంతో ఎమ్మెల్యేల జాతకం జగన్ సమక్షంలోనే తేలిపోతుంది అని అంటున్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేల పేర్లను ఈసారి జగన్ ప్రకటిస్తారా అని కూడా చర్చ సాగుతోంది.
ఇక ఎన్నికలు ముంచుకు వస్తున్న వేళ గడప గడపకు కార్యక్రమం మీద సమీక్ష ఇదే చివరిది అని కూడా అంటున్నారు. దాంతో ఇప్పటి నుంచే అందరినీ సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి జగన్ రిపోర్టులో ఉన్నది ఉనంట్లుగా చెబుతారు అని అంటున్నారు.
మరో ఎనిమిది నెలలలో ఎన్నికలు కాబట్టి ఇక గ్రాఫ్ పెంచుకున్నా పెరిగే అవకాశాలు పెద్దగా ఉండవు కాబట్టి ఎవరి బాగా వెనకబడ్డారు అన్న లిస్ట్ ని ప్రకటించడం ద్వారా అక్కడ ఆల్టర్నేటివ్ లీడర్ షిప్ ని రెడీ చేస్తారా అన్న చర్చ కూడా సగుతోంది. ఇప్పటి నుంచే కొత్త వారికి పగ్గాలు ఇవ్వకపోతే ఎన్నికల టైం కి వారు కూడా పుంజుకునే అవకాశాలు లేవు అంటున్నారు. మొత్తానికి లాస్ట్ రివ్యూ టైం అంటున్నారు. దాంతో ఎమ్మెల్యేలలో విపరీతమైన టెన్షన్ మొదలైంది అని కూడా చెబుతున్నారు.