సె*క్స్ పార్టీ తర్వాత 20 ఏళ్ల మోడల్ మిస్సింగ్.. ఏం జరిగింది?
అయితే... ఆ పార్టీ జరిగిన సుమారు 10 రోజుల తర్వాత ఆమె దుబాయ్ లోని ఓ రోడ్డు పక్కన అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కనిపించారు.;

ఓ మోడల్ కి సంబంధించిన షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... మార్చి 9న దుబాయ్ లోని ఓ హోటల్ లో జరిగినట్లు చెబుతున్న "సె*క్స్ పార్టీకి" హాజరైన తర్వాత 10 రోజులుగా ఓ మోడల్ కనిపించకుండా పోయింది. ఈ సమయంలో ఆమె ఓ భయంకరమైన స్థితిలో కనిపించడం సంచలనంగా మారింది.
అవును... ఈ నెల 9న దుబాయ్ లోని ఓ హోటల్ లో జరిగిన పార్టీకి హాజరైన తర్వాత 20 ఏళ్ల ఓ మోడల్.. నాటి నుంచి 10 రోజులుగా కనిపించకుండా పోయింది. అయితే.. అనూహ్యంగా ఆమె వెన్నెముక, అవయువాలు విరిగి రోడ్డు పక్కన కనిపించింది. ఈ భయంకరమైన సంఘటన అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు 4 ఆపరేషన్లు అయ్యాయి!
అయితే... ఆ పార్టీ జరిగిన సుమారు 10 రోజుల తర్వాత ఆమె దుబాయ్ లోని ఓ రోడ్డు పక్కన అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కనిపించారు. ఆ సమయంలో ఆమె వెన్నెముక, పలు అవయువాలు విరిగిపోయి.. శరీరమంతా రక్తంతో తడిచి కనిపించింది. ఆ సమయంలో ఆమె మాట్లాడే పరిస్థితుల్లో లేదని చెబుతున్నారు!
ఆమె ప్రస్తుతం దుబాయ్ లో చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో.. ఆమె తల్లి నార్వే నుంచి ఆమె దగ్గరకు వచ్చారు. ఈ సందర్భంగా.. దుబాయ్ పోలీసులు ఆమె దేశంలో ఉన్నట్లు ధృవీకరించగా.. ఆమెకు ఆ స్థాయిలో తీవ్ర గాయాలు బిల్డింగ్ పై నుంచి పడిపోవడం వల్ల సంభవించాయని చెబుతున్నారు.
ఈ సందర్భంగా దుబాయ్ లోని "సె*క్స్ పార్టీ"లో ఒక దానిలో ఆమె చిక్కుకున్నారని ఆమె కుటుంబ సభ్యులు నమ్ముతున్నారని రష్యన్ మీడియా నివేదించింది. అక్కడ, ప్రధానంగా తూర్పు యూరప్ నుంచి వచ్చిన వారిని సెక్స్ బానిసలుగా చేస్తారని.. ఆమె అత్యాచారం అనంతరం రోడ్డున పడేశారని అనుమానిస్తున్నారని అంటున్నారు.