జమిలి ఎన్నికలపైన మోడీ పక్కా క్లారిటీ !
భారత దేశం ఐక్యతను పటేల్ గట్టిగా కోరుకున్నారు అని ఆయన గుర్తు చేశారు.
దేశంలో జమిలి ఎన్నికలు జరుగుతాయా అంటే కచ్చితమని బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి స్పష్టంగా చెప్పేసింది. సర్దార్ వల్లభాయి పటేల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యత గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఒకే దేశం అన్న నినాదం ఇచ్చారు. ఒకే దేశం ఒకే లక్ష్యం అందరి విధానం కావాలని అన్నారు. భారత దేశం ఐక్యతను పటేల్ గట్టిగా కోరుకున్నారు అని ఆయన గుర్తు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో ముందుకు వెళ్తున్నట్లుగా మోడీ స్పష్టం చేసారు.
దేశమంతా ఒక్కటి అని చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు. ఒకే దేశం ఒకే ఎన్నికలతో దేశం మరింతగా బలపడుతుందని మోడీ చెప్పడం విశేషం. అంతే కాదు వన్ నేషన్ వన్ రేషన్ అన్న విధానంతో పేదలకు మేలు జరుగుతుందని అన్నారు. తొందరలొనే వన్ నేషన్ వన్ సివిల్ కోడ్ అన్న విధానాన్ని తీసుకుని వస్తామని కూడా ప్రధాని మోడీ చెప్పారు. దీని వల్లనే దేశంలో వివక్షలు తెర పడుతుందని అన్నారు.
ఇక అంతే కాదు దేశంలో జమిలి ఎన్నికలు జరగబోతున్నాయని నరేంద్ర మోడీ చెప్పిన విషయాలు చూస్తే కనుక నిజంగా జమిలికి ముహూర్తం దగ్గర పడిందనే అనుకోవాలని అంటున్నారు. వాస్తవానికి 2014 నుంచి బీజేపీ అధికారంలోకి వచ్చాక జమిలి ఎన్నికలను జరపాలని ఆలోచిస్తూ వస్తోంది. అది కాస్తా ఇపుడు కార్యరూపం దాల్చేలా కనిపిస్తోంది.
దాంతోనే మోడీ మరోసారి జమిలి ఎన్నికల మీద దేశానికి క్లారిటీ ఇచ్చారు అని అంటున్నారు. జమిలి ఎన్నికలను కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న మోదీ ఆ దిశగా అడుగులు పడుతున్నాయని కూడా చెప్పేశారు.
సాధ్యమైనంత త్వరలోనే ఒక దేశం ఒక ఎన్నికను అమలుపరుస్తామని కూడా ఆయన స్పష్టం చేసారు. తెలిపారు. అంతే కాదు దేశంలో జరిగే జమిలి ఎన్నీకలను ఎవరూ అడ్డుకోలేరని కూడా ప్రధాని మోదీ ధీమాను ప్రకటించారు.
ఈ విధంగా జమిలి ఎన్నికల గురించి ఖచ్చితంగా జరుగుతుందని ప్రధానమంత్రి మోడీ చెప్పడంతో మరోసారి జమిలి ఎన్నికల విషయం ఇపుడు దేశంలో మళ్ళీ చర్చకు వస్తోంది. అంతే కాదు 2027లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం చూస్తే 2024 క్యాలెండర్ పూర్తి కావస్తోంది. ఇక మధ్యలో మిగిలింది 2025, 2026 మాత్రమే. ఆ విధంగా చూస్తే కనుక జమిలి ఎన్నికలకు కచ్చితంగా రెండేళ్ల వ్యవధి మాత్రమే ఉంది అని అర్ధం అవుతోంది. జమిలి ఎన్నికలను యూపీ ఎన్నికలతో పాటుగానే జరిపిస్తారు అని అంటున్నారు.
సో జమిలి ఎన్నికల మీద మోడీ స్పష్టంగా చెప్పేసారు కాబట్టి ఇక జమిలికి దేశమంతా సిద్ధం కావాల్సిందే. అంతే కాదు రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు నుంచే తమ పనిలో తాము నిమగ్నం కావాల్సిందే. ఇక ఏపీలో చూస్తే 2027 నాటికి అధికారంలోకి వచ్చి మూడేళ్ళు మాత్రమే పూర్తి అవుతుంది. సో ఆ విధంగా చూసుకున్నా ఒక ఇక మిగిలింది కూటమి ప్రభుత్వానికి రెండేళ్ళ సమయమే అని అంటున్నారు.