'కొత్త ప‌న్ను'కే మోడీ మ‌ద్ద‌తు.. అస‌లేంటిది?

అయితే.. తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో నూత‌న ప‌న్ను విధానానికి పెద్ద పీట వేశారు.

Update: 2024-07-23 08:00 GMT

దేశంలో ప్ర‌భుత్వ‌, ప్రైవేటు రంగాల్లో క‌లిపి 50 కోట్ల పైచిలుకు మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో రూ.20 వేల వేత‌నం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. గ‌రిష్ఠంగా ప్ర‌భుత్వ సెక్టార్‌లో 4 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆదాయం పొందుతున్న‌వారు(నెల‌కు) కూడా ఉన్నారు. ఇక‌, ప్రైవేటు సెక్టార్‌లో ఏడాదికి కోటి రూపాయాల‌పై నే ఆదాయం అందుకుంటున్న‌వారు కూడా ఉన్నారు. అయితే.. తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్‌లో నూత‌న ప‌న్ను విధానానికి పెద్ద పీట వేశారు.

వాస్త‌వానికి 2021లోనే నూత‌న ప‌న్ను విధానం తీసుకువ‌చ్చారు. అయితే.. దీనిలోకి మారేందుకు ఉద్యోగులు అంగీక‌రించ‌డం లేదు. దీనిలోకి సంక్లిష్ట‌త‌లు.. అదేవిధంగా ప‌న్ను మిన‌హాయింపులు లేక‌పోవ‌డం వంటివి ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా కొత్త ప‌న్ను విధానంలోకి మార్పు చేయించే దిశ‌గా మోడీ స‌ర్కారు అడుగులు వేసింది. కొత్త ప‌న్ను విధానంలో రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఇచ్చారు. అదేవిధంగా ఖ‌చ్చిత మిన‌హాయింపుల‌ను కూడా.. రూ.50 వేల నుంచి రూ.75 వేల‌కు పెంచారు.

ఇక‌, శ్లాబుల వారీగా కూడా.. ప‌న్నుల‌ను మిన‌హాయించారు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు 5 శాతం, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలకు మించి ఆదాయంపై 30 శాతం పన్ను వ‌ర్తిస్తుంది. అయితే.. పాత ప‌న్ను విదానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయ‌లేదు. దీంతో ఇప్పుడు త‌ప్ప‌నిస‌రిగా కొత్త ప‌న్ను విధానంలోకి మారక త‌ప్ప‌ని ప‌రిస్థితిని తీసుకువ‌చ్చిన‌ట్ట‌యింది.

లాభ‌మా? న‌ష్టమా?

+ కొత్త ప‌న్ను విధానంలో దీర్ఘకాలంలో అన్ని ఆదాయపు పన్ను మినహాయింపులను ఉపసంహరించు కుంటారు. అంటే.. రాబోయే రోజుల్లో ప‌న్ను మిన‌హాయింపులు ఉండ‌వు. ఇది ప్ర‌ధాన స‌మ‌స్య‌.

+ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వ్యక్తులు లేదా HUFలు IT చట్టంలోని సెక్షన్ 115BAC కింద లీవ్ ట్రావెల్, ఇంటి అద్దె, ఇతరులకు మినహాయింపులకు అర్హులు కాదు.

+ పాత ప‌న్ను విధానంలో అమ‌ల‌వుతున్న సెక్షన్ 80C, 80CCC, 80CCD, 80D, 80DD, 80DDB, 80E, 80EE, 80EEA, 80EEB, 80G, 80GG, 80GG, 80GGC, 80IA, 80-IAB, 80-IAC, 80-IB, 80-IBA, మొదలైనవి కొత్త ప‌న్ను విధానంలో అమ‌లు కావు. (ప్ర‌స్తుతం ఇవి ఎత్తేశారు కూడా)

Tags:    

Similar News