ఆ ఎంపీ భేష్: తొలి సంతకం.. కోటి విరాళంపైనే!
ఆదివారం ఆయన ఎన్నికల ఫలితాలను వెలువరించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎంపీ చిన్నీ ఎన్నికయ్యారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నీ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) కమిటీ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఏపీ ఎన్నికల మాజీ ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహరించారు. ఆదివారం ఆయన ఎన్నికల ఫలితాలను వెలువరించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా ఎంపీ చిన్నీ ఎన్నికయ్యారు. ఆయన ప్యానెల్ మొత్తంగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం.
దీనిలో వైస్ ప్రెసిడెంట్‌గా వెంటక ప్రశాంత్, సెక్రటరీగా సానా సతీష్, జాయింట్ సెక్రటరీగా విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు, ట్రెజరర్‌గా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌గా విష్ణు తేజ ఎన్నియ్యారు. ఈ సందర్భంగా విజయవాడలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్.. తన తొలి నిర్ణయంగా.. ఏసీఏ నిధుల నుంచి కోటి రూపాయలను వరద ప్రభావిత ప్రాంతాల్లోని వారికి కేటా యించారు. ఈ మేరకు ఆయన చెక్కుపై సంతకం చేశారు. దీనిని సీఎం చంద్రబాబుకు అందించనున్నా రు.
కాగా.. ఏసీఏ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల ఎంపీ చిన్నీ హర్షం వ్యక్తం చేశారు. అత్యంత పారదర్శకంగా ఏసీఏను నిర్వహించనున్నట్టు తెలిపారు. మంగళగిరి, కపడలోని స్టేడియంలను మరిన్ని సౌకర్యాలతో ఆధునీకరించనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించేందుకు విశాఖ పట్నంలో మాత్రమే స్టేడియం ఉందని.. దీనివల్ల ఎక్కువ అవకాశాలు రావడం లేదని తెలిపారు.. ఈ నేపథ్యంలో ఇంటర్నేషన్ క్రికెట్ టీంలు వచ్చేందుకు వీలుగా మరిన్నిస్టేడియంలను అభివృద్ది చేయనున్నట్టు వివరించారు.