యానిమల్ మూవీపై మహిళా ఎంపీ ఫైర్...తన కూతురిని ఏడిపించిన మూవీ!

ఈ సందర్భంగా టాలీవుడ్ రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ ను సొంతం చేసుకుంది

Update: 2023-12-08 07:47 GMT

లాంగ్వేజెస్ తో సంబంధం లేకుండా అటు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్, మల్లూవుడ్ అనే తరతమ్యాలేవీ లేకుండా "యానిమల్" సినిమా రిలీజ్ అయిన ప్రతీ చోటా థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది! ఈ సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్నా ఇప్పటికీ థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు ఎగబడుతున్నారు! థియేటర్లలో ప్రేక్షకులు విజిల్స్ కి టెన్షన్ కి మధ్య కొట్టిమిట్టాడుతున్నారు!

ఈ సందర్భంగా టాలీవుడ్ రెబల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ ను సొంతం చేసుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి.. తొలి సినిమాతోనే అద్భుతమైన పునాది వేసుకున్నాడు. ఆ సినిమాపై కొంతమంది రాజకీయ నాయకులనుంచి విమర్శలు వచినా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు.

ఈ సమయంలో... అర్జున్ రెడ్డి సినిమా తర్వాత నెక్స్ట్ ఎవరితో సందీప్ రెడ్డి సినిమా చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. ఒకానొక సమయంలో పలురకాల పేర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో గాసిప్స్ కి అవకాశం లేకుండా ఆయన బాలీవుడ్ కు వెళ్ళాడు. తెలుగులో బోనీలో బోనీ కొట్టిన అర్జున్ రెడ్డిని రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.

ఈ క్రమంలో తాజాగా "యానిమల్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రణబీర్ కపూర్ హీరోగా నటించిన "యానిమల్" సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తుంది. అర్జున్ రెడ్డి తరహాలోనే ఈ సినిమాపైనా విమర్శలూ, ప్రశంసలూ వరుసగా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఒక ఎంపీ ఈ సినిమాపై ఫైర్ అయ్యారు.

అవును... ఛత్తీస్‌ గఢ్‌ కు చెందిన కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ యానిమల్ సినిమా కంటెంట్‌ పై విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో తన కుమార్తె సినిమా చూసి ఏడుస్తూ థియేటర్ల నుండి బయటకు వచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... సినిమా అనేది సమాజానికి అద్దంలాంటిదని.. అది యువతపై చాలా ప్రభావం చూపుతుందని అన్నారు.

అనంతరం... ఈ రోజుల్లో యువతపై ప్రభావం చూపే కొన్ని సినిమాలు వస్తున్నాయి.. మొదట కబీర్ సింగ్, పుష్ప లాంటి సినిమాలు వచ్చాయి.. రీసెంట్ గా యానిమల్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సమయంలో "నా కూతురు తన కాలేజ్ ఫ్రెండ్స్‌ తో కలిసి సినిమా చూడటానికి వెళ్ళింది, ఏడుపు ఆపుకోలేక మధ్యలోనే బయటకు వెళ్ళిపోయింది" అని వెల్లడించారు.

ఇదే క్రమంలో ఈ సినిమా గురించి తన కూతురు ఏమి చెప్పిందనే విషయాలపైనా ఎంపీ స్పందించారు. ఇందులో భాగంగా... చాలా హింస సినిమాలో చూపించారని.. హింస, మహిళల వేధింపులు లాంటి వాటిని చిత్రాలలో చూపించడం తనకు ఇష్టం లేదని.. ఈ నెగెటివ్ రోల్స్ ప్రెజెంట్ చేయడంలో చూపించిన హింస 11,12వ తరగతి పిల్లలపై ప్రభావం చూపుతున్నాయని తన కుమార్తె తెలిపారని అన్నారు.

ఇక యానిమల్ సినిమాలో "అర్జన్ వాయిలీ" పాటను ఉపయోగించడంపై కూడా ఎంపీ స్పందించారు. ఇందులో భాగంగా ఆ విషయంపై విమర్శించారు. పంజాబీ యుద్ధ గీతాన్ని... యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ పాత్ర హంతక విధ్వంసానికి దారితీసే సన్నివేశంలో చూపించారని అన్నారు.

Tags:    

Similar News