ఇండిగోకు ఇచ్చిపడేశారు... బీసీఏఎస్ భారీ జరిమానా!
గతకొంతకాలంగా ఇండిగో విమానాల్లో జరుగుతున్న విషయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి
గతకొంతకాలంగా ఇండిగో విమానాల్లో జరుగుతున్న విషయాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఘటనలపై బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లు సీరియస్ గా రియాక్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా ఇండిగో విమానయాన సంస్థకు భారీ జరిమానాలు విధించాయి!
అవును... గతంలో ఒకసారి ఢాకా నుంచి కోల్ కతా వెళ్తున్న ఇండిగో విమానంలో దోమలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులంతా తీవ్ర సౌకర్యానికి గురవ్వగా... బ్యాట్ లు చేతపట్టిన ఎయిర్ హోస్టేస్ ఆ దోమలపై విమానంలో యుద్ధం ప్రకటించి తీవ్రంగా శ్రమించారు. అప్పట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇది నాడు ఈ విషయం ఇండిగో విమానయాన సంస్థపై నెట్టింట సెటైర్లకు కారణం అయ్యింది.
చండీగఢ్ నుంచి జైపుర్ కు ఇండిగో విమానం ఏసీలు ఆన్ చేయకుండానే బయల్దేరింది. సరే ఇప్పుడైనా ఆన్ అయిపోద్దిలే అని చూస్తున్న ప్రయాణికులకు ల్యాండిగ్ వరకు ఏసీ ఆన్ అవ్వలేదు. దీంతో ప్రయాణికులు చాలా అవస్థపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఈ క్రమంలో తాజాగా విమానం ఆలస్యం కావడంతో ముంబయి విమానాశ్రయంలో నేలపైనే ప్రయాణికులు ఆహారం తీసుకున్న ఘటన తెరపైకి వచ్చింది. దీంతో ఈ విషయన్ని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) లు సీరియస్ గా పరిగణించాయి. దీంతో... ఇండిగో విమానయాన సంస్థ, ముంబయి ఎయిర్ పోర్టు, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ లకు జరిమానాలు విధించాయి.
ఇందులో భాగంగా... విమానం ఆలస్యం కావడంతో ముంబయి ఎయిర్ పోర్ట్ లో నేలపైనే ప్రయాణికులు ఆహారం తీసుకున్న ఘటనలో ఇండిగో సంస్థపై రూ.1.20 కోట్లు, ముంబయి ఎయిర్ పోర్టుపై రూ.60 లక్షల జరిమానా విధించింది బీసీఏఎస్. ఇదే సంఘటనకు సంబంధించి ఇండిగోపై డీజీసీఏ రూ.30 లక్షలు పెనాల్టీ వేసింది. అదేవిధంగా... పైలట్ల రోస్టరింగ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఎయిరిండియా, స్పైస్ జెట్ సంస్థలకు రూ.30 లక్షలు చొప్పున జరిమానా విధించింది.