యూఎస్ ప్రెసిడెంట్ గా మస్క్ పోటీ... తెరపైకి కీలక విషయాలు!

మరో కొన్ని రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Update: 2024-10-22 04:13 GMT

మరో కొన్ని రోజుల్లో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య రసవత్తరంగా జరగనుందని అంటున్నారు. సర్వేల అంచనాలు కూడా ఫుల్ కన్ఫ్యూజన్ లో పాడేస్తూ.. ఎవరు గెలుస్తారనే విషయంపై పూర్తి స్పష్టతను మిస్ అవుతున్న పరిస్థితి.

ఇక ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ క్యాండిడేట్స్ గా పోటీ పడుతున్న ఇద్దరి పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అయితే... ఈ ఎన్నికల్లో పబ్లిక్ గా తన మద్దతు ట్రంప్ కు ప్రకటించిన ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ హడావిడి మరొకెత్తనే చెప్పాలి. ట్రంప్ అధ్యక్షుడయ్యే వరకూ తాను ఆయన వెంటే ఉంటానని ప్రకటించి, ఆర్థికంగా భారీగా సపోర్ట్ చేసినట్లు చెబుతున్నారు.

ఇంతకాలం డొనాల్డ్ ట్రంప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న మస్క్... ఇప్పుడు ఇండివిడ్యువల్ గా కూడా ప్రచారం చేస్తున్నారు! ఇక ఇప్పటికే పెన్సిల్వేనియాలో రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి రోజూ డ్రా తీస్తామని.. వారిలో ఎంపికైన ఓటరుకు 1 మిలియన్ డాలర్స్ (సుమారు రూ.8.4) కోట్లు అందజేస్తామని ఆసక్తికరమైన ఆఫర్ తో ముందుకు వచ్చారు.

ఈ సమయంలో ఎలాన్ మస్క్ అమెరికా ప్రెసిడెంట్ గా ఎందుకు పోటీ చేయలేదు అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ ప్రశ్న మస్క్ కు తాజాగా మరోసారి ఎదురైంది. దీనిపై ప్రపంచ కుబేరుడు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.. తనకు రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మరో కీలక కారణం కూడా చెప్పారు.

అవును... యూఎస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ పడటాన్ని ఎలాన్ మస్క్ మరోసారి తోసిపుచ్చారు. ఈ సమయంలో కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... తాను అమెరికా ప్రెసిడెంట్ గా పోటీ చేయకపోవడానికి న్యాయపరంగా, వ్యక్తిగతంగా పలు కారణాలు ఉన్నాయని ఆయన తాజాగా వివరించారు.

ఇందులో భాగంగా... తాత అమెరికన్ అయినప్పటికీ.. తాను మాత్రం ఆఫ్రికాలో జన్మించినట్లు చెప్పారు. అందువల్ల అధ్యక్ష పదవికి తాను అనర్హుడినని తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తనకు రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదని చెప్పిన మక్స్... ఇప్పుడు తాజాగా న్యాయపరమైన సమస్యలను తెరపైకి తెచ్చారు.

ఇదే సమయంలో... తన దృష్టంతా కార్లు, రాకెట్ల అభివృద్ధి పైనే ఉందని.. తనకు అదే ఆసక్తి అని.. ప్రజలకు ఎంతో అవసరమైన సాంకేతికతను రూపొందించడమే తనకు ఇష్టమని మస్క్ పేర్కొన్నాడు.

Tags:    

Similar News