నానీకి వైసీపీలో లైన్ క్లియర్.. తాజా అప్‌డేట్ ఇదే!
టీడీపీ ఫైర్‌బ్రాండ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ దూరమవుతున్నారనే విషయం తెలిసిందే. తానే స్వయంగా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు.
టీడీపీ ఫైర్‌బ్రాండ్, విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆ పార్టీ దూరమవుతున్నారనే విషయం తెలిసిందే. తానే స్వయంగా ఈ విషయాన్ని తాజాగా వెల్లడించారు. త్వరలోనే తాను ఢిల్లీ వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, ఆ వెంటనే టీడీపీకి కూడా రాజీనామా చేస్తానని కేశినేని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంద్రబా బు తనను వద్దనుకున్నప్పుడు తాను మాత్రం పార్టీని ఎలా కోరుకుంటానని ఆయన ఎదురు ప్రశ్నించారు.
ఇక, ఇప్పుడున్న పరిస్థితిలో కేశినేనికి ప్రత్యామ్నాయం వైసీపీనే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కొన్నాళ్లుగా వైసీపీ నాయకులతో నాని చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. టీడీపీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాలను గాలికి వదిలేసి.. వైసీపీ గెలిచిన ఎమ్మెల్యే స్థానాల్లో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎంపీ లాడ్స్ కూడా ఈ నియోజకవర్గాల్లోనే ఖర్చు చేశారు. దీంతో ఇది కూడా టీడీపీలో అప్పట్లో చర్చకు దారితీసింది.
అయినా.. నాని వెరువకుండానే ముందుకు సాగారు. ఇదిలావుంటే.. తాజాగా నాని.. వైసీపీ నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావుతో కలిసి.. కారులో ప్రయాణించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం వైసీపీ టికెట్ల వ్యవహారంతో తలమునకలై ఉన్న నేపథ్యంలో ఎంపీ కేశినేని వ్యవహారంపై ఆసక్తి నెలకొంది. ఆయన త్వరలోనే వైసీపీలోకి చేరిపోవడం ఖాయమనే ఒకవైపు చర్చ సాగుతోంది.
మరోవైపు.. తాను ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే చెబుతానన్న ఎంపీ నాని వెంటనే మాట మార్చి.. ఇండిపెండెం ట్‌గా అయినా.. పోటీ చేస్తానని చెప్పారు. కానీ. ఇప్పుడు ఆ అవకాశం లేదకుండా.. వైసీపీ దూతగా ఉన్న మొండితోక కారులోనే నాని ప్రయాణం చేయడం గమనిస్తే.. వైసీపీ ఎంపీ నానికి లైన్ క్లియర్ చేసిందనే వాదన వినిపిస్తోంది. ఇక, ఆయన టీడీపీ ని వదులుకున్న మరుక్షణం .. జగన్ ఆయనకు కండువా కప్పుడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.