నెట్టింట రచ్చ... టీడీపీ "బిగ్ ఎక్స్ పోజ్" ఏమైంది?

Andhrapradesh,Naralokesh,Bigexpose,Alliancegovernment,Chandrababu,Socialmediatweet,Politicalnews

Update: 2024-10-23 10:05 GMT

ఇటీవల ఎక్స్ వేదికగా ముందు రోజు ప్రకటించి.. తర్వాత రోజు గుడ్ న్యూస్ లు చెబుతున్నారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా ఇటీవల విశాఖలో టీసీఎస్ ఏర్పాటు విషయంలోనూ లోకేష్ ఇలాంటి సర్ ప్రైజ్ నే ఇచ్చారు. ముందు రోజు ప్రకటించి.. తర్వాత రోజు రివీల్ చేశారు. ఈ నేపథ్యంలో "బిగ్ ఎక్స్ పోజ్!" అంటూ మరో ప్రకటన చేశారు.

 

ఇందులో భాగంగా..."బిగ్ ఎక్స్ పోజ్! మధ్యాహ్నం 12 గంటలకు వస్తుంది.. వేచి చూడండి" అని ఎక్స్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ పై నెట్టింట తీవ్ర సందడి నెలకొంది. అటు వైసీపీ క్యాడర్ లోనూ ఇదే చర్చ జరిగింది. టీడీపీ పేల్చబోయే ఆ బాంబ్ ఏమిటా అంటూ నెట్టింట పలు ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే ఆ ఎక్స్ పోజ్ వాయిదా పడింది.

అవును... బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్ పోజ్ ఉండబోతోందని.. వేచి ఉండాలని అధికార టీడీపీ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటన కార్యరూపం దాల్చలేదు. సమయం దగ్గరపడుతున్న కొద్దీ తీవ్ర ఉత్కంఠ రేగిన వేళ... తూచ్ అంటూ మరో పోస్ట్ వెలిసింది. ఇందులో భాగంగా... ఈ బిగ్ ఎక్స్ పోజ్ ను వాయిదా వేస్తూ మరో పోస్ట్ పెట్టారు.

దీంతో.. నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. గడువు సమీపించి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ 11:30 గంటలు దాటిన .. "బిగ్ ఎక్స్ పోజ్.. కమింగ్ ఆన్ అక్టోబర్ 24.. మధ్యాహ్నం 12 గంటలకు" అని మరో పోస్ట్ పెట్టారు. దీంతో... పక్కాగా ప్లాన్ చేసుకుని ప్రకటించి ఉండాల్సింది అంటూ టీడీపీపై విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు!

ఇక కామెంట్ సెక్షన్ లో అటు వైసీపీ శ్రేణులు, ఇటు టీడీపీ శ్రేణులూ పలు రకాల అంచనాలు పోస్ట్ చేస్తున్నారు. మరి.. గురువారం మధ్యాహ్నం అయినా ఆ "బిగ్ ఎక్స్ పోజ్" వెలుగులోకి వస్తుందా.. లేక, మరోసారి వాయిదా పడుతుందా అనేది వేచి చూడాలి. మరోపక్క.. వస్తే మాత్రం చాలా గట్టిగానే వస్తుంది అని అంటున్నారు తమ్ముళ్లు!

Tags:    

Similar News