జగన్ మీద లోకేష్ పంచ్ వీక్ గా ఉందా ?

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత టీడీపీ కూటమి మీద వరసబెట్టి విమర్శలు చేస్తున్నారు.

Update: 2024-09-17 10:45 GMT

ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత టీడీపీ కూటమి మీద వరసబెట్టి విమర్శలు చేస్తున్నారు. ఆయన జిల్లాల పర్యటనలలో మీడియా ముఖంగా అలాగే ట్వీట్ల ద్వారా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల మీద విద్య వైద్య రంగాలలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మీద కూడా జగన్ డిమాండ్ చేస్తున్నారు. ఆయన చంద్రబాబునే నేరుగా అడుగుతూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

తాజాగా విద్యా శాఖ మీద జగన్ చేసిన విమర్శలు వైరల్ అయ్యాయి. దానికి బదులు అన్నట్లుగా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా కౌంటర్ చేశారు. దాని మీద వైసీపీ నిక్కర్ మంత్రి అంటూ లోకేష్ మీద ఘాటు గానే ఆన్సర్ ఇచ్చింది.

ఇదిలా సాగుతోంది. అయితే అటు అధికార కూటమి ఇటు విపక్ష వైసీపీల మధ్య సాగుతున్న ఈ మాటల యుద్ధంలో ఎవరు ఏమిటి ఎవరు పంచులు హిట్ అయ్యాయి, జనంలోకి ఏవి హైలెట్ అయ్యాయి అన్న చర్చ కూడా నడుస్తోంది.

ఇక చూసుకుంటే జగన్ మీద లోకేష్ ఎక్స్ లో పెట్టిన పోస్టులో వేసిన పంచుల మీద కూడా డిస్కషన్ సాగుతోంది. అయితే లోకేష్ వేసిన పంచులేవీ బాగాలేవు అని అంటున్నారు. మరో వైపు చూస్తే లోకేష్ విద్యా శాఖ మంత్రిగా అయి నాలుగు నెలలకు దగ్గర అవుతోంది కానీ ఆయన ఏ విద్యార్థికీ ఇప్పటిదాకా ఏమీ ఇవ్వలేదు కదా అన్న చర్చ కూడా వస్తోంది.

అదే సమయంలో సీబీఎస్ఈ వాళ్ళు ఫెయిల్ అయ్యారు అని లోకేష్ అంటూ దానికి కారణం జగన్ అని పంచులేయడమే చిత్రంగా ఉంది అని అంటున్నారు. అయితే అలా ఫెయిల్ అయిన వారికి కొన్ని గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయించవచ్చు కదా అని చర్చ కూడా ఉంది. ఒక వేళ స్టూడెంట్స్ కి సిలబస్ అన్నది అర్థం కాకపోతే గ్రేస్ మార్కులు ఇస్తే పాస్ అవుతారు కదా అని సూచిస్తున్నారు.

ఇంకో వైపు చూస్తే తల్లికి వందనం అని సూపర్ సిక్స్ హామీలలో టీడీపీ ప్రధానంగా చెప్పుకొచ్చింది. మరి ఆ సూపర్ సిక్స్ హామీని ఎంతవరకూ నెరవేర్చారు అన్నది కూడా అడుగుతున్నారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ తల్లికి వందనం పధకం గురించి మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నారు. అంతే కాదు దాని మీద కూడా ఆయన ఎక్స్ లో తన ట్వీట్లను పెడితే బాగుంటుంది అని అంటున్నారు. ఈ విధంగా లోకేష్ పెట్టిన పోస్ట్ మీద ఒక్క లెక్కన ట్రోల్స్ అయితే వస్తున్నాయని అంటున్నారు.

విద్యా శాఖ మంత్రిగా బాధ్యత గలిగిన పదవిలో ఉన్న నారా లోకేష్ ఇంకా పార్టీ నేతగా వ్యవహరిస్తూ జగన్ దే అన్నింటికీ తప్పు అని కామెంట్స్ చేస్తే జనాలు వాటిని లైట్ తీసుకుంటారు అని అంటున్నారు. ప్రభుత్వం తాము ఏమి చేస్తుందో చెప్పాలి, అలాగే ఏమి చేయబోతోందో కూడా చెప్పాలి. అంతే తప్ప విపక్షం నుంచి వచ్చిన విమర్శలను గతంలో మాదిరిగా పంచులేస్తూ కూర్చుంటే రాజకీయంగా అది బాగానే ఉంటుందేమో కానీ జనాలు అయితే వాటికి తీసుకోరు అని అంటున్నారు.

కూటమి ప్రభుత్వం మీద గంపెడాశలు జనాలు పెట్టుకున్నారు. దాంతో కూటమి నుంచి వచ్చే ప్రతీ మాటను జనాలు బాగా గమనిస్తారని అంటున్నారు. రాజకీయ నేతల మధ్య డైలాగ్ వార్ అని అందులో నెగ్గాలని అనుకుంటే అది జనాలకు ఏ మాత్రం సంబంధం లేని విషయం అని అంటున్నారు.

ప్రజలకు ఏదైనా మేలు చేసి ఇదిగో మా ప్రభుత్వంలో ఇది చేసామని గట్టిగా చెప్పుకుంటే అపుడు ప్రజలు కూడా ప్రత్యర్థుల మీద ప్రభుత్వ పెద్దలు వేసే పంచులను చూస్తారు. అంతే తప్ప మాటకు మాట అన్నట్లుగా డైలాగ్ వార్ కి తెర లేపితే అది చివరికి ఆ పంచులే వీక్ అయిపోతాయని అంటున్నారు.

ఏది ఏమైనా గత ప్రభుత్వం ఏదో తమ కాడికి తాము చేశామని అంటోంది. దాని మంచి చెడ్డలను చూసి మరింత మేలు చేయడానికి రెండు అడుగులు వేయాల్సిన చోట ఇంకా మాజీ సీఎని వైసీపీని నిందిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు అని అంటున్నారు మరి ఈ విషయంలో నారా లోకేష్ పెట్టిన పోస్టుకు వస్తున్న ట్రోల్స్ ని చూసి అయినా సరిచేసుకుంటారా అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి.

Tags:    

Similar News