నిరుద్యోగులకు లోకేష్ భారీ గుడ్ న్యూస్... టీచర్స్ కి బిగ్ రిలీఫ్!

ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకరం చేసిన అనంతరం చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-11-15 07:54 GMT

ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకరం చేసిన అనంతరం చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో వీలైనంత త్వరగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా... వచ్చే ఏడాది నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.

అవును... ఏపీలోని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలపై సర్కార్ ఆరా తీస్తుందని అంటున్నారు. ఈ ఐదేళ్లలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు డీఎస్సీ ద్వారా ఉపాధి కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఫలితంగా... త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతోంది.

ఈ నేపథ్యంలోనే స్పందించిన నారా లోకేష్... వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభ సమయానికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇదే సమయంలో... న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఇదే క్రమంలో... 1994 నుంచి డీఎస్సీల నిర్వహణపై ఆరా తీస్తున్నామని లోకేష్ తెలిపారు..

ఇక, గత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నియామకాలు చేపట్టలేదని.. ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేదని విమర్శించిన లోకేష్.. ఎన్నికల సమయంలో మాత్రం హడావిడిగా ఫిబ్రవరి 2024లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని.. అది కూడా 6,100 పోస్టులకంటూ నోటిఫై చేశారని.. ఆ తర్వత దాన్ని కూడా పట్టించుకోలేదని అన్నారు.

ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేస్తామని లోకేష్ తెలిపారు. అదేవిధంగా.. బాత్ రూం ల ఫోటోలు తీసే బాధ ఉపాధ్యాయులకు ఉండదని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో మొత్తంగా 15 సార్లు డీఎస్సీ నిర్వహించినట్లు తెలిపారు. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ లో ఉపాధ్యాయుల్ని భాగస్వామ్యం చేస్తామని తెలిపారు.

Tags:    

Similar News