నరేష్ అంకుల్.. ఏకంగా 250 మంది యువతులను వాడుకున్నాడు!
ఈ మోసగాడి వివరాల్లోకి వెళ్తే.. నరేష్ పూరి గోస్వామి ఎలియాస్ నరేష్ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో ప్రొఫైల్ తెరిచాడు.
ప్రస్తుతం చాలా మంది పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోనీ వెబ్ సైట్ల పైనే ఆధారపడుతున్నారు. కొందరు వీటి ద్వారా మంచి సంబంధాలను పొందుతుండగా.. మరికొందరు మాత్రం దారుణంగా మోసపోతున్నారు. కిలాడీలు తప్పుడు ఫొటోలు, ప్రొఫైల్స్ తో పెళ్లి సంబంధాలంటూ మోసం చేస్తున్నారు. పరిచయాలు పెంచుకుని, ఆ తర్వాత పెళ్లాడి.. అందినకాడికి ధనం, బంగారం దోచుకుని టోకరా వేస్తున్నారు.
ఇప్పుడు ఇలాగే నరేష్ అనే ఒక వ్యక్తి 25 ఏళ్ల క్రితం నాటి ఫొటోను మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో పోస్టు చేశాడు. ఏకంగా 250 మంది మహిళలు, యువతులను వాడుకుని మోసం చేశాడు. వీరిలో కొంతమందిని శారీరకంగా వాడుకున్నాడు. మరికొందరి వద్ద అందినకాడికి డబ్బులు దండుకున్నాడు.
ఈ మోసగాడి వివరాల్లోకి వెళ్తే.. నరేష్ పూరి గోస్వామి ఎలియాస్ నరేష్ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో ప్రొఫైల్ తెరిచాడు. తన ప్రొఫైల్ లో తాను విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారిగా పేర్కొన్నాడు. వితంతవులు, విడాకులు తీసుకున్న యువతులు, మహిళలను టార్గెట్ చేశాడు. ఇలా 250 మంది మహిళలు, యువతులకు వల వేశాడు. వారిని పెళ్లాడతానని నమ్మించాడు. నిందితుడు విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారి అని ప్రొఫైల్ లో ఉండటంతో చాలా మంది మహిళలు ఇతడిని కాంటాక్ట్ అయ్యారు.
ఈ క్రమలో తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన మహిళకు కూడా ఇలాగే వల వేశాడు. పెళ్లి విషయం మాట్లాడాలని నరేష్ కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు ఆ మహిళను పిలిపించాడు. ఆ తర్వాత టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలని, డబ్బులు తరువాత ఇస్తానని, తన పర్స్ ఇంట్లోనే మరిచిపోయి వచ్చానని మాయమాటలు చెప్పాడు. ఈ క్రమంలో అతడిపైన అనుమానమొచ్చిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు నరేష్ ను బెంగళూరు సిటీ పోలీసులు రైల్వే స్టేషన్ లో అరెస్టు చేశారు. నిందితుడు బ్లాక్ లో రెండు సిమ్ కార్డులు కొనుక్కొని వాటిని వాడుతున్నాడని పోలీసులు వెల్లడించాడు. ఓ హిందీ దినపత్రికల్లో పెళ్లి చేసుకోవడానికి ప్రకటనలు ఇచ్చిన మహిళలను గుర్తించి వారి ఫోన్ నెంబర్లు సేకరించి వారికి ఫోన్లు చేసేవాడు. వారిని తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించేవాడు.
ఇలా రాజస్థాన్ కు చెందిన 56 మంది, ఉత్తరప్రదేశ్ కు చెందిన 32, ఢిల్లీకి చెందిన 32 మంది, కర్ణాటకకు చెందిన 17 మంది, మధ్యప్రదేశ్‌కు చెందిన 16 మంది, మహారాష్ట్రకు చెందిన 13 మంది, గుజరాత్ కు చెందిన 11 మంది మహిళలను మోసం చేసినట్లు వెల్లడైంది. ఇంకా చాలా మంది మహిళలు, యువతులను కూడా నరేష్ మోసం చేసినట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది పరువు పోతోందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని పోలీసులు తెలిపారు. వితంతువులు, విడాకులు తీసుకున్నవారిని నిలువునా మోసం చేయడం నిందితుడి డ్రీమ్ అని వెల్లడించారు.