సుప్రింకోర్టుకే మోడీ షాకిచ్చారా ?

అయితే ఎన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినా మోడీ వెనక్కు తగ్గటంలేదు. మరి బిల్లుపై సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది.

Update: 2023-08-11 05:30 GMT

సుప్రింకోర్టుకే నరేంద్రమోడీ షాకిచ్చారు. ఎలాగంటే కేంద్ర ఎన్నికల కమీషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపికలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రమేయంలేకుండా చేసేశారు. సీజేఐకి బదులుగా కేంద్ర న్యాయశాఖ మంత్రిని సభ్యుడిగా ప్రతిపాదించారు. అంటే ఇప్పటికప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చేస్తుందని కాదు. కానీ ఈ మార్పులతో ఒక బిల్లు తయారుచేసి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సంఖ్యాబలం కారణంగా ఆ బిల్లు ఎలాగు పాస్ అయిపోవడం ఖాయం. కాబట్టి తర్వాత చట్టం కూడ అయిపోతుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కమిషనర్ ఎంపిక ప్యానల్లో ప్రధానమంత్రి, లోక్ సభలో విపక్ష నేత, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సభ్యులుగా ఉన్నారు. ప్రధానమంత్రి నాయకత్వంలో జరిగే సమావేశంలో మిగిలిన ఇద్దరు పాల్గొంటారు నియామకాలపై చర్చలు జరిపి సంతకాలు చేసిన తర్వాతే అమల్లోకి వస్తుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకంలో అక్రమాలు జరుగుతున్న ఆరోపణలకు ఫులిస్టాప్ పెట్టేందుకే సుప్రింకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నది.

చీఫ్ కమిషనర్, కమిషనర్ నియామకంపై పార్లమెంటులో ఒక చట్టం చేసేంతవరకు సుప్రింకోర్టు చెప్పిన కమిటీయే నియామకాలు చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా మోడీ ఒక బిల్లును ప్రతిపాదించారు. ఇందులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్లేసులో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఉంటారు. ఇపుడున్న ప్యానల్ ప్రకారం ప్రధానమంత్రి అనుకున్న వ్యక్తి ఏకపక్షంగా చీఫ్ ఎలక్షన్ కమీషనర్ లేదా ఎన్నికల కమీషనర్ కాలేరు. ఎందుకంటే మెజారిటి చీఫ్ జస్టిస్, ప్రతిపక్ష నేతది అవుతుంది.

తాజా బిల్లు ప్రకారం చీఫ్ జస్టిస్ ప్లేసులో న్యాయశాఖ మంత్రి వస్తారు. అంటే ప్రధానమంత్రి ఎవరిని అనుకుంటే వాళ్ళనే చీఫ్ కమీషనర్, కమీషనర్లుగా నియమించవచ్చు. ఈ బిల్లును ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

అయితే ఎన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినా మోడీ వెనక్కు తగ్గటంలేదు. మరి బిల్లుపై సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తున్నది ఆసక్తిగా మారింది. ఒకవైపు ప్రతిపక్షాలను మరోవైపు న్యాయవ్యవస్ధను కూడా మోడీ గుప్పిట పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయం అర్ధమైపోతోంది.

Tags:    

Similar News